అలాంటిదేమీ లేదు అవన్నీ రూమర్లే.. జానీ మాస్టర్ క్లారిటీ

Jani Master Condemns bigg boss telugu 4 Rumors

టాలీవుడ్ కొరియోగ్రఫర్స్‌లో జానీ మాస్టర్‌ది ప్రత్యేక శైలి. మెలికలు తిరిగే స్టెప్పులు వేయించాలన్నా, తమ అభిమాన హీరో చేత స్ప్రింగ్‌లా డ్యాన్సులు చేయించాలన్న అది కేవలం జానీ మాస్టర్ వల్లే అవుతుంది. మరీ ముఖ్యంగా మెగా హీరోలకు అతి దగ్గరైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. రామ్ చరణ్, అల్లు అర్జున్‌లకు ప్రత్యేకమైన స్టెప్స్ కంపోజ్ చేస్తుంటాడు. ఇక ఈ మధ్యే బుట్టబొమ్మ అంటూ దేశాన్ని ఊపేశాడు.

Jani Master Condemns bigg boss telugu 4 Rumors
Jani Master Condemns bigg boss telugu 4 Rumors

జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టైలీష్ స్టెప్పులకు దేశం మొత్తం ఫిదా అయింది. అంతటి క్రేజ్‌ను సంపాదించుకున్న జానీ మాస్టర్ బిగ్ బాస్ 4లో ఓ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వబోతోన్నాడని వార్తల వైరల్ అయ్యాయి. జానీ మాస్టర్‌కు బుల్లితెరపైనా క్రేజ్ ఉండటంతో అంతా కూడా అది నిజమని భావించారు. ఇక జానీ మాస్టర్ ఎంటరైతే ఓటింగ్ బాక్స్ బద్దలవుతాయని అప్పుడే అంచనాలు కూడా పెట్టుకున్నారు. మెగా ఫ్యాన్స్ మద్దతు ఉండటంతో జానీ మాస్టర్ లెవెల్ వేరేలా ఉంటుందని అందరూ భావించారు.

Jani Master Condemns bigg boss telugu 4 Rumors
Jani Master Condemns bigg boss telugu 4 Rumors

కానీ బిగ్ బాస్ వార్తలను జానీ మాస్టర్ ఖండించాడు. తాను బిగ్ బాస్ 4లో పార్టిసిపేట్ చేయబోతోన్నట్టు వస్తోన్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశాడు. తాను ప్రస్తుతం సినిమా షూటింగ్‌ల కోసం రెడీ అవుతున్నానని క్లారిటీ ఇచ్చాడు. బిగ్ బాస్ 4కు సంబంధించి వస్తోన్న వార్తలను నమ్మొద్దని చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా ఈ లిస్ట్‌లోకి టీవీ 9 యాంకర్ దేవీ నాగవల్లి వచ్చి చేరింది. ఇలా రోజుకో కొత్త పేరు తెరపైకి రావడంతో అంతా గందరగోళంగా మారుతోంది.