Jani Master: అల్లు అర్జున్ అరెస్టుపై జానీ మాస్టర్ కామెంట్స్…. సంతోషపడ్డానంటూ?

Jani Master: గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ అరెస్ట్ విషయం సంచలనగా మారింది. పుష్ప2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్ రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు తనని చూడడం కోసం తరలివచ్చారు దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో భాగంగా రేవతి అనే మహిళ అభిమాని మరణించారు. ఈ విషయంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు కావడం ఆయన జైలుకు వెళ్లి ఒక రోజంతా జైల్లో గడిపి రావడం జరిగింది.

ఇలా మద్యంతర బెయిల్ మీద అల్లు అర్జున్ బయటకు వచ్చినప్పటికీ ఈయన మాత్రం ఈ వివాదం నుంచి బయటపడలేదు తరచు పోలీస్ విచారణ, కోర్టు విచారణ అంటూ ఈ కేసు విషయంలో అని తిరుగుతూ ఉన్నారు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ కావడం పట్ల ఇప్పటికి ఎంతో మంది సెలబ్రిటీలు ఈయన అరెస్టు విషయంపై స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సైతం ఒక ఇంటర్వ్యూ సందర్భంగా అల్లు అర్జున్ అరెస్ట్ గురించి స్పందించారు.

గతంలో కూడా జానీ మాస్టర్ జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. తన అసిస్టెంట్ మహిళ కొరియోగ్రాఫర్ పట్ల జానీ మాస్టర్ అసభ్యకరంగా వ్యవహరించారు అంటూ ఆమె కేసు పెట్టడంతో ఈయన జైలుకు వెళ్లి వచ్చారు. ఇకపోతే అల్లు అర్జున్ అరెస్ట్ గురించి నాకు తెలిసిన వెంటనే చాలా సంబరపడ్డాను అంటూ సోషల్ మీడియాలో కొన్ని రకాల మీమ్స్ వచ్చాయి. వాటినీ చూసి తాను చాలా బాధపడ్డానని తెలిపారు.

అల్లు అర్జున్ గారి అరెస్టు విషయం తెలిసిన వెంటనే నాకు ముందుగా గుర్తుకు వచ్చింది తన పిల్లలేనని జాని మాస్టర్ తెలిపారు. నేను అరెస్టు అయినప్పుడు నా పిల్లలు ఎంత బాధ పడ్డారో నాకు తెలుసు. అరెస్ట్ అనేది మన శత్రువుకి కూడా రాకూడదు అంటూ ఈయన వెల్లడించారు. అందుకే బన్నీ అరెస్ట్ అవ్వగానే తనకు మొదట తన పిల్లలే గుర్తుకు వచ్చారని జానీ మాస్టర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.