Jani Master: జానీ మాస్టర్ కు గుమ్మడికాయ దిష్టి తీసిన మేకర్స్…. కన్నీళ్లు పెట్టుకున్న మాస్టర్?

Jani Master: జానీ మాస్టర్ గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఈయన తన అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ పట్ల అత్యాచారానికి పాల్పడ్డారు అంటూ ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈయన జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెయిలు మీద బయట ఉన్న జానీ మాస్టర్ తిరిగి సినిమా పనులలో బిజీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఈయన ఓ సినిమాకు కమిట్ అయ్యారు.

ఈ సినిమా ప్రస్తుతం బెంగళూరులో షూటింగ్ జరుపుకోబోతున్న నేపథ్యంలో జానీ మాస్టర్ బెంగళూరుకు వెళ్లారు అయితే ఈయన సినిమా షూటింగ్ లోకేషన్ లోకి అడుగుపెట్టగానే ఈ సినిమా నిర్మాతలు ఆయనకు ఏకంగా గుమ్మడికాయ కొబ్బరికాయతో దిష్టి తీసి సాదర స్వాగతం పలికారు అనంతరం ఆయనకు స్వాగతం పలుకుతూ కేక్ కూడా కట్ చేయించారు.

ఈ విధంగా ఆ సినిమా సెట్ లో తనకు లభించిన గౌరవ మర్యాదలకు ఒక్కసారిగా జానీ మాస్టర్ కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయ్యారు. చాలా కాలం తర్వాత బెంగళూరుకు వచ్చాను. యూవర్స్ సిన్సియర్లీ రామ్ సెట్స్‌లో అడుగుపెట్టిన నాకు హ్యాపీగా ఉంది. గుర్తుండిపోయే గ్రాండ్ వెల్కమ్ ఇచ్చినందుకు థాంక్స్. నన్ను సపోర్ట్ చేసి నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు.

జానీ మాస్టర్ చేసిన ఈ కామెంట్స్ పై అభిమానులు కూడా స్పందిస్తూ ఈయనకు ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నారు. మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కారణంగా ఈయనకు రావాల్సిన నేషనల్ అవార్డు కూడా వెనక్కి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే .దాదాపు నెల రోజులకు పైగా ఈయన జైలులో ఉండి బయటకు వచ్చారు. తన ప్రమేయం లేకపోయినా తన ఎదుగులను చూసి ఓర్వ లేనటువంటి కొంతమంది ఇలా చేయించారని త్వరలోనే నిజా నిజాలు అన్నీ కూడా బయటకు వస్తాయి అంటూ జానీ మాస్టర్ గతంలో తన అరెస్టు గురించి కూడా ఘాటుగా స్పందించారు.