మూడు రోజుల్లో ఇస్మార్ట్ శంకర్ సేఫ్ ! ఇక లాభాలే !!

మూడురోజుల్లో ఇస్మార్ట్ శంకర్ సేఫ్ ! ఇక లాభాలే !!

పూరి మాస్‌ మసాలా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ఇస్మార్ట్‌ శంకర్‌. పూరి దర్శకత్వంలో రామ్‌ పోతినేని హీరోగా ఈ సినిమా మూడు రోజుల్లోనే సేఫ్‌ జోన్‌లోకి ఎంటర్‌అయిపోయింది.

తొలి మూడు రోజుల్లో ఈ సినిమా 36 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించినట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. ఈ రోజు కూడా కలెక్షన్లు భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీంతో తొలి వారాంతానికే ఇస్మార్ట్‌ శంకర్‌ 50 కోట్ల మార్క్‌ను చేరుకునే అవకాశం ఉందంటున్నారు సినీ పండితులు.

చాలా కాలం తరువాత పూరి జగన్నాథ్‌ బిగ్‌ హిట్‌ సాధించటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. రామ్ సరసన నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో షియాజీ షిండే, ఆశిష్‌ విద్యార్థిలు కీలక పాత్రలో నటించారు.