(ధ్యాన్)
విశాల్ ఇంట త్వరలోనే పెళ్లి బాజా మోగనుందా? అంటే ఏమో.. మోగనూ వచ్చు అని అంటున్నారు తమిళ తంబిలు. అందుకు కారణం లేకపోలేదు … ఏంటా కారణం అని అడిగితే ఆసక్తికరమైన అంశాలే వెలుగులోకి వచ్చాయి. విశాల్ నటించిన `పొగరు` సినిమాలో విల్లీ పాత్రలో నటించారు శ్రియా రెడ్డి. ఆమెను విశాల్ అన్నయ్య విక్రమ్ కృష్ణ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు విశాల్ తాజాగా `సండైకోళి2`లో నటిస్తున్నారు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ విల్లీ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే వరలక్ష్మికి, విశాల్‌కీ మధ్య ఏదో ఉందని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని తెలుస్తోంది. అయితే విశాల్ మాత్రం తనకు వరలక్ష్మి మంచి ఫ్రెండ్ అని అంటున్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్ష పదవికి విశాల్ నిలబడినప్పుడు వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ కూడా వ్యతిరేకించారు. కానీ అప్పుడు కూడా వరలక్ష్మి విశాల్ తరఫునే నిలుచుంది. వీటన్నిటిని బట్టి చూస్తే వారి మధ్య ప్రేమ కచ్చితంగా ఉందన్నది నిర్ధారణ అవుతోంది. ఇక పెళ్లి సంగతిని మాత్రం వారు అధికారికంగా ప్రకటించేవరకు వెయిట్ చేయాల్సిందే.