సుశాంత్ మాన‌సిక ఒత్తిడికి ట్రీట్మెంట్ లోనే ఏదో తేడా

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య‌పై ర‌క‌ర‌కాల ఊహాగానాలు సాగుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు ఇది హ‌త్య అంటూ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. సుశాంత్ అభిమానులు దీనిపై సీబీఐ విచార‌ణ  జ‌ర‌పాల‌ని కూడా డిమాండ్ చేశారు. ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు ఇదే విష‌యాన్ని ప‌దే ప‌దే డిమాండ్ చేశారు.

అదంతా అటుంచితే వివాదాస్ప‌ద న‌టి పాయ‌ల్ రోహిత్గి సుశాంత్ విషాదాంతంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సుశాంత్ ది ముమ్మాటికి హ‌త్యే. అత‌డికి చికిత్స చేసిన వైద్యుడి ఫాల్ట్ కూడా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. ఆయ‌న బైపోలార్ డిజార్డ‌ర్ ఉంద‌ని త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన ప్ర‌తి పేషెంట్ కి అదే ట్రీట్ మెంట్ ఇస్తుంటారు. ఇంత‌కుముందు నేను కూడా ఆయ‌న బాధితురాలినే! అని తెలిపింది.

అత‌డి ప్రిస్కిప్ష‌న్ లోనే ఏదో తేడా ఉంద‌ని.. ఇక ఆ వైద్యుడితో మ‌హేష్ భ‌ట్ .. దిబాక‌ర్ బెన‌ర్జీ వంటి ప్ర‌ముఖుల‌కు సంబంధాలున్నాయ‌ని వ్యాఖ్యానించింది పాయ‌ల్ రోహిత్గి. మ‌హేష్ భ‌ట్ తో సుశాంత్ ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తి ఎఫైర్ సాగించ‌డం కూడా ముప్పుగా మారింద‌ని ఆరోపించింది. మొత్తానికి యువ‌హీరో ఆత్మ‌హ‌త్య వెన‌క ర‌క‌ర‌కాల కోణాల్ని ఈ అమ్మ‌డు ట‌చ్ చేసింది. 

https://twitter.com/Payal_Rohatgi/status/1275433318251663361