ముంబయి: శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి చేసినట్లు అసభ్యకరమైన వ్యాఖ్యపై నటి కంగనా రనౌత్ స్పందించారు.
తన ట్విట్టర్ ఖాతానుండి కంగనా రనౌత్ ఇలా వ్రాసింది: “2008 లో మూవీ మాఫియా నన్ను సైకోగా ప్రకటించింది, 2016 లో వారు నన్ను విచ్ అండ్ స్టాకర్ అని పిలిచారు 2020 లో మహారాష్ట్ర మంత్రి ప్రచారం నాకు హెచ్ **** ఖోర్ లడ్కి బిరుదు ఇచ్చింది, ముంబైలో నేను సురక్షితం కాదని ఒక హత్య తర్వాత చెప్పాను, INTOLERANCE చర్చ యోధులు ఎక్కడ ఉన్నారు? “
రాజకీయ పరిశీలకుడు మాధవ్ శర్మ చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందనగా కంగనా ట్వీట్ వచ్చింది: “సంగయ్ రౌత్ కంగనాటీమ్ శివాజీ మహారాజ్‌కు వ్యతిరేకంగా ట్వీట్ చేసారని చెప్తున్నాడు. ఇది అబద్ధం. శివాజీ మహారాజ్ కి వ్యతిరేకంగా ఆమె ఎప్పుడూ ఏమీ అనలేదు. అధికారంలో వున్నా వారు ఒక మహిళని బహిరంగంగా దూషించడం సిగ్గుచేటు, వాక్స్వాతంత్రం గురుంచి మాట్లాడే యోధులు ఎందుకు స్పందించడం లేదు”
సంజయ్ రౌత్ ఇంటర్వ్యూ ఉన్న వీడియోను బిజెపి సభ్యుడు మేజర్ సురేంద్ర పూనియా ట్వీట్ చేశారు, తరువాత కంగనా రీట్వీట్ చేశారు.
In 2008 Movie Mafia declared me a Psycho, in 2016 they called me a Witch and Stalker in 2020 Maharashtra Minister publicity gave me the title of Haramkhor Ladki, because I said after a murder I feel unsafe in Mumbai, where are INTOLERANCE debate warriors? https://t.co/me91rxsShr
— Kangana Ranaut (@KanganaTeam) September 5, 2020