మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. సినిమాల్లో ఎంత సరదాగా ఉంటాడో సోషల్ మీడియాలోనూ అంతే జాలీగా ఉంటాడు. ఇక సమాజ సేవ, న్యాయపోరాటం, అన్యాయాలను ప్రశ్నించడంలో అందరికంటే ముందుంటాడు. సమాజంలో ఆడవారిపై జరిగే అన్యాయాలు,అత్యాచారాలపై తన గళాన్ని వినిపిస్తాడు. సుశాంత్ సింగ్ కేసు విషయంలోనూ మంచు మనోజ్ తన గొంతును వినిపించాడు.
సోషల్ మీడియాలో అడిగిన, అడగని వారికీ అందరికీ సాయం చేస్తుంటాడు మనోజ్. అలా ఎంతో మందికి ఇప్పటి వరకు సాయం చేశాడు. గుప్తసాయాలు చేయడంలో మనోజ్ ముందుంటాడు. తన అభిమానులకు కూడా అదే బోధిస్తాడు. ఎవరికైనా సాయం కావాలంటే చేయండని సూచిస్తాడు. లాక్ డౌన్‌లో అలా ఎంతో మందికి సాయం చేశాడు. మరీ సోనూ సూద్ తరహాలో కాకపోయినా తన స్థాయిలో మంచు మనోజ్ వీలైనంతగా చేస్తున్నాడు.
తాజాగా మంచు మనోజ్ చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు. ఓ నెటిజన్ తన పాపకు హార్ట్ సర్జరీ చేయాలని, కానీ డబ్బులు లేవని సాయం చేయండని యాంకర్ ప్రదీప్‌ను వేడుకున్నాడు. అయితే అది మంచు మనోజ్ కంట పడింది. వెంటనే స్పందించి.. వివరాలు పంపండి.. డాక్టర్ డీటైల్స్ కూడా పంపండి.. నాకు చేతనైంది చేస్తాను అని భరోసా ఇచ్చాడు. మనోజ్‌ను అడగకపోయినా సమస్యను గుర్తించి సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. అందుకే అతను మంచు మనోజ్ కాదు.. మంచి మనోజ్.