Payal Rohatgi: చేతబడి చేశాను అంటూ భయంకర నిజాన్ని బయటపెట్టిన హీరోయిన్..?

Payal Rohatgi: బాలీవుడ్ బ్యూటీ, ఫైర్ బ్రాండ్ కంగనారనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాల్టీ షో లాకప్. ఇక ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూనే కంటెస్టెంట్ లు సంచలనాత్మక సీక్రెట్ లను బయట పెడుతూ సెన్సేషన్ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎలిమినేషన్ నుంచి పట్టించుకోవడానికి హీరోయిన్ పాయల్ రోహత్గి ఒక భయంకరమైన నిజాన్ని బయటపెట్టేసింది. పాయల్ రోహత్గి మాట్లాడుతూ.. నేను 15 ఏళ్లుగా ఇండస్ట్రీ లో ఉంటున్నాను. ఒకానొక సమయంలో నా కెరిర్ డల్ అయిపోయింది.

మీరు నమ్ముతారో లేదో కానీ నా కెరీర్లో పుంజుకునేలా చేయడానికి నేను చేతబడి చేశాను అని చెప్పి అక్కడున్న వారందరికీ షాక్ ఇచ్చింది పాయల్ రోహత్గి.అందుకోసం ఢిల్లీ లోని పూజారి సహాయంతో చేతబడి లోని వశీకరణం అనే తాంత్రిక విద్యను చేశాను. కానీ ఆ తాంత్రిక విద్యలు చేయడంవల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు. నాకు కెరిర్ ను కాపాడుకోవడానికి వశీకరణం చేశానని ఎవరికి అయినా చెబితే నన్ను చులకన చేసి మాట్లాడతారేమో అని భయపడ్డాను అని చెప్పుకొచ్చింది..

అయితే ఇటువంటి వశీకరణం లాంటివి చదువుకున్న అమ్మాయిలు ఉద్యోగం చేసే మహిళలు ఇలాంటివి నమ్ముతారో నమ్మరేమో! కానీ నమ్మి చేతబడి చేయించిన ఆ విషయాన్ని గుట్టుగా దాచి పెడతారు అని చెప్పుకొచ్చింది. ఈ రహస్యాన్ని విన్న తర్వాత కంగనా రనౌత్ గట్టిగా నవ్వుతూ.. నీకు అందంతోపాటు టాలెంట్ కూడా ఉంది.. నీకు ఇటువంటి మంత్రతంత్రాలు అవసరం లేదు.. నేను కూడా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఏదో చేతబడి చేశారని ఆరోపించారు. ఒకవేళ అమ్మాయి సక్సెస్ అయింది అనుకుంటే జనాలు ఆ విషయాన్ని కూడా శంకిస్తారు. నువ్వు సీక్రెట్ చెప్పి నీ ధైర్యాన్ని చాటుకున్నావు. కాకపోతే నువ్వు సంగ్రమ్ ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు. ఈ విషయం విన్న తర్వాత అతను నేను ఒక మాంత్రికురాలిని ప్రేమించానని అనుకోడా?అని ప్రశ్నించగా ఆ విషయం పై పాయల్ స్పందిస్తూ.. ఏది నమ్మాలి అనుకుంటున్నాడు అతనికె వదిలేస్తున్నాను.. కానీ నేను అతనిపై మాత్రం చేతబడి చెయ్యలేదు అని చెప్పుకొచ్చింది పాయల్ రోహత్గి.