లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకు పరిమితమైన సంగతి తెలిసిందే. టైంపాస్ గా ఓటీటీలకు…ఎంటర్ టైన్ మెంట్ ఛానళ్లకే అతుక్కుపోయారు. తెలుగులో ఇబ్బడి ముబ్బడిగా ఉన్న ఎంటర్ టైన్ మెంట్ ఛానల్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. లాక్ డౌన్ తో గంట కూడా గ్యాప్ లేకుండా వాయించే సీరియళ్లు కూడా నిలిచిపోయాయి. దీంతో ఎంటర్ టైన్ మెంట్ ఛాన్సల్ కి ఉన్న ఒకే ఒక్క దారి సినిమాతో జనాల్ని ఎంటర్ టైన్ చేయడం. దీంతో దాదాపు ఛానల్స్ అన్ని గత 50 రోజులుగా సినిమాలనే ప్రసారం చేసాయి. వీటిలో కొన్ని ఛానల్స్ వారంలో వేసిన సినిమానే రెండు..మూడు సార్లు కూడా వేసి జనాల్ని విసిగించిన ఛాన్సల్ కూడా ఉన్నాయి.
మరీ ముఖ్యంగా జీ తెలుగు…మా టీవీ ఛానల్స్ అయితే ఒకే వారంలో ఒకే సినిమాను రెండుసార్లు వేసి తలబొబ్బి కట్టించాయి. అయితే జెమినీ టీవీ మాత్రం తెలివిగా పాత..కొత్త సినిమాలను కలిపి వేసింది. అవి అరిగిపోయిన సినిమాలే అయినా తెలివిగా వ్యరించడంతో ఈ లాక్ డౌన్ ని సదరు ఛానల్ ఎన్ క్యాష్ చేసుకోల్గింది. దీంతో ఆ ఛానల్ టీఆర్ పీ రేంటింగ్ అమాంతం పెరిగింది. దీంతో ఈటీవీ ని వెనక్కి నెట్టి జెమినీ ముందు వరుసలో నిలిచింది. బార్క్ విడుదల చేసిన తాజా టీవీఆర్ రేటింగ్స్ ప్రకారం జెమిని టీవీ తెలుగు టీవీ ఛానెళ్లలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ వారం టాప్ -5 యొక్క టివిఆర్ (యు + ఆర్) రేటింగ్స్ – మహర్షి (8.86), విజిల్ (6.87), రాజా (6.36), ఠాగూర్ (5.61), మరియు బాహుబలి – ది కన్‌క్లూజన్ (5.02) జెమిని టివిలో ప్రసారం అయ్యాయి. వరుసగా మూడు వారాల పాటు మొదటి స్థానంలో ఉన్న ఈటివి ఇప్పుడు మూడవ స్థానానికి పడిపోయింది.
లాక్డౌన్ ప్రారంభ రోజుల్లో, న్యూస్ బులెటిన్లను ప్రసారం చేసిన ఈటివి తెలుగు, మూడు వారాల పాటు మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న జెమినీ ఛానల్ కు ఈ లాక్ డౌన్ కాస్త ఊరటనిచ్చినట్లు అయింది. అయితే కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు ఈ మూడు నెలలు పాటు ఇంటి అద్దెలు తీసుకోవద్దని..లాక్ డౌన్ అనంతరం వాయిదాల ప్రకారం చెల్లించమని తెలిపాయి. అయితే సదరు ఛానల్స్ మాత్రం అలాంటి ఆఫర్లేమి పెట్టలేదు. లాక్ డౌన్ కారణంగా మా ఆపరేటర్ మీ దగ్గరకు రాలేడు. మీరే నెలవారి ఫీజ్ ఆన్ లైన్ లో చెల్లించేయండి అంటూ వడ్డించింది.