లాక్ డౌన్ ప్రభావంతో సినిమాలు ఆగిపోవడం, మొదలుకావాల్సిన చిత్రాలు కొన్ని పూర్తిగా క్యాన్సిల్ అవ్వడం జరిగాయి. నిర్మాతలు వడ్డీల బాధ భరించలేక ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్నారు. నటీనటుల పారితోషకాల్లో భారీగా కోతలు పెడుతున్నారు. హీరోల సంగతేమో కానీ హీరోయిన్లు మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితులు బాగోలేకపోవడంతో ఇచ్చినంత తీసుకుని సైలెంట్ అయిపోతున్నారు. స్టార్ హీరోయిన్లు సైతం సినిమాలు ఉంటాయో ఉండవో అని కంగారుపడుతూ రెమ్యునరేషన్ దగ్గర పెద్దగా బెట్టు చేయట్లేదు. ఇలా అందరు కథానాయికలు పరిస్థితుల దృష్ట్యా ఒక మెట్టు దిగితే నయనతార మాత్రం అస్సలు కాంప్రమైజ్ కావట్లేదు.
మాములుగా ఎంత రెమ్యునరేషన్ అయితే తీసుకుంటుందో ఈ పాండమిక్ సిట్యుయేషన్లో కూడ అంతే తీసుకుంటోంది. అడిగినంత ఇవ్వండి లేదంటే మానుకోండి అనే ధోరణిలోనే ఉందట నయన్. అయినా కూడ ఆమెను అప్రోచ్ అవుతూనే ఉన్నారు నిర్మాతలు. ఆమెకున్న స్టార్ క్రేజ్ దృష్ట్యా అడిగినంత ఇచ్చి డేట్స్ తీసుకుంటున్నారు. ఇప్పటికే ‘నెట్రికారన్, అన్నాత్తే’ చిత్రాలతో పాటు ప్రియుడు విగ్నేష్ శివన్ సినిమా కూడ చేస్తున్న ఆమె తాజాగా ఇంకో రెండు కొత్త సినిమాలకి సైన్ చేసింది. ఈ రెండు చిత్రాలకుగాను ఆమె భారీగానే అందుకుందట. ఇండస్ట్రీలోని కథానాయికలు ఎక్కడో ఒక చోట ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే నయన్ మాత్రం హ్యాపీగా సినిమాలకు సైన్ చేస్తూ ప్రియుడితో ఛాటెడ్ ఫ్లైట్స్ లో తిరుగుతూ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.