సాధారణంగా ప్రతీ చిన్న చిన్న కార్యక్రమాన్ని కూడా భారీ ఎత్తున ప్లాన్ చేసి, పబ్లిసిటీ పీక్స్ కి తీసుకెళ్లడంలో చంద్రబాబు దిట్ట అని చెబుతుంటారు. ఈ క్రమంలో చాలా మంది ప్రాణాలు పోయినా కూడా బాబు పట్టించుకోరని అంటుంటారు. ఈ సందర్భంగా పుష్కరాలవంటి సంఘటనలను గుర్తుకు తెస్తుంటారు.
ఆ సంగతి అలా ఉంటే… చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు దాటిందని.. ముఖ్యమంత్రిగా 14ఏళ్లపాటు పనిచేశారనేది తెలిసిన విషయమే. అయితే వీటితోపాటు మరొక ముఖ్యమైన విషయం కూడా ఉంది. అదే… చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి నిన్నటితో 28ఏళ్లు పూర్తయ్యింది. ఇది చిన్న విషయం కాదు.
అసలు ఈపాటికి రాష్ట్రం మొత్తం పసుపు జెండాలతో నిండిపోవాలి.. పత్రికలు పసుపు ప్రకటనలతో నిండిపోవాలి.. టీవీ ఛానల్స్ లో ప్రకటనలు హోరెత్తాలి.. ప్రతీ నియోజకవర్గంలోనూ కేకులూ గట్రా కొసేసుకోవాలి! కానీ… ఎక్కడా చీమ చిటుక్కుమన్న చప్పుడు లేదు! కారణం… ఆ పదవి సొంతంగా తెచ్చుకున్నది కాదు.. కష్టపడిన సొమ్మూ కాదు!!
కష్టపడి సంపాదించుకున్న వ్యక్తి 10 రూపాయలే సంపాదించుకున్నా ఘనంగా, ధైర్యంగా చెప్పుకోగలుగుతాడు… అదే కోటి రూపాయలు దొంగతనంగా సంపాదించుకున్న వ్యక్తి మాత్రం భయంభయంగా బ్రతుకుతుంటాడు! ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి అలానే ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
పూర్తి వివరాళ్లోకి వెళ్తే… చంద్రబాబునాయుడు మొట్టమొదటిసారి 1995, సెప్టెంబర్ 1న ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే… ఇప్పటికి 28 ఏళ్లు గడిచాయన్నమాట. అయినా కూడా ఎక్కడా చప్పుడు లేదు.. టీడీపీ తో పాటు వారి అనుకూల మీడియా సైతం సైలంటుగా ఉంది.
కారణం… నాటి రోజుల్ని ఇప్పుడు గుర్తు చేసుకోవడం ద్వారా రాజకీయంగా లాభం కంటే నష్టమే ఎక్కువనేది మిగిలినవారికంటే చంద్రబాబుకే బాగా తెలుసు. చంద్రబాబు సీఎంగా మొదటిసారి బాధ్యతలు తీసుకుని 28 ఏళ్లైందని సంబరాలు చేసుకుంటే.. సోషల్ మీడియా, ప్రత్యర్థులు మాత్రం ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అప్పుడే మూడు దశాబ్దాలు అవుతుందా? అని కౌంటర్స్ వేస్తారనడంలో సందేహం లేదు.
దీంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా… అలాంటి విమర్శలకు చోటు ఇవ్వకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు & కో మౌనంగా ఉండిపోయారని అంటున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు కూడా తాను సీఎంగా బాధ్యతలు తీసుకున్న తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.