సాటి హీరోలతో పోలిస్తే చెర్రీ ప్లానింగ్ అట్టర్ ఫ్లాప్!
మెగాస్టార్ వారసుడిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్‌లో అడుగుపెట్టి స్టార్ హీరోగా రాణించాడు. అయితే ఇటీవలి కాలంలో తనని వెనక్కి నెట్టి ఇతర స్టార్ హీరోలు ఎదిగేయడం అన్నది మెగా ఫ్యాన్్స్ లో చర్చకు తావిస్తోంది. బాహుబలి లాంటి క్రేజీ సిరీస్ తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కానీ రెండో సినిమా మగధీర తోనే పాన్ ఇండియా రేంజ్ అనిపించుకున్న చరణ్ ఎందుకని హిందీ మార్కెట్ ని తెచ్చుకోలేకపోతున్నాడు? అన్న సందిగ్ధతను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు.. రామ్ చరణ్ తన కెరీర్‌ను సరిగ్గా ప్లాన్ చేయలేదని విమర్శలు ఇటీవల అధికమయ్యాయి. క్రైసిస్ లో పడి ఎటూ తేలని ఆర్.ఆర్.ఆర్ సంగతి అటుంచితే.. సాటి స్టార్ హీరోల ప్లానింగ్ తో పోలిస్తే చరణ్ చాలా వెనకబడి ఉన్నాడు. అంతేకాదు రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ దక్కినా.. నాన్ బాహుబలి కేటగిరీలో నంబర్ వన్ స్టార్ అని ప్రూవ్ చేసినా ఎందుకనో ప్లానింగ్స్ పరంగా ఇతర స్టార్లతో పోలిస్తే వెనకబడి ఉన్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అతని సమకాలీనులకు ఎప్పుడూ అగ్రదర్శకులతో మంచి సినిమాలు ఉంటాయి. కానీ చరణ్ కి ఏవి? రామ్ చరణ్ కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకుంటాడు. ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా తరవాత చరణ్ ఏ సినిమా చేస్తున్నాడు? అంటే సమాధానమే లేదు. సాటి స్టార్ హీరో ఎన్టీఆర్ ఇప్పటికే త్రివిక్రమ్‌తో తన తదుపరి చిత్రాన్ని లాక్ చేసాడు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఆల్మోస్ట్ ఖాయం చేసుకున్నాడు. అలాగే కొరటాల శివతో సినిమా చేసేందుకు.. ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నాడు.
ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్ కూడా వరుసగా మూడు నాలుగు సినిమాలకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు. వరుసగా అగ్ర దర్శకుల్ని లాక్ చేశారు వీళ్లంతా. తమ ప్రస్తుత పనులకు ఫాలో అప్ సినిమాలను ఖరారు చేశారు. కానీ రామ్ చరణ్ మైండ్ మాత్రం బ్లాంక్ గా ఉంది ఇప్పటికీ. అంతేకాదు ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న వెంటనే డిజాస్టర్లు ఇవ్వడం చెర్రీకి అతి పెద్ద మైనస్ గా మారింది. మగధీర తర్వాత ఆరెంజ్ డిజస్టర్. అలానే రంగస్థలం తర్వాత వినయ విధేయ రామ సన్నివేశం ఇదే. ఆ రెండు సందర్భాల్ని అతడు ఎన్ క్యాష్ చేసుకోవడంలో తడబడ్డాడు. ఆ తర్వాత కూడా ఇండస్ట్రీ హిట్ చిత్రాల్ని అందించి సత్తా చాటడంలో మెగా పవర్ స్టార్ దారుణంగా విఫలమయ్యాడు.
ఈపాటికే చేయాల్సి ఉన్నా.. ఇప్పటికీ త్రివిక్రమ్ లేదా కోరటాల శివతో ఒక్క సినిమా కూడా చేయలేదు. తన కెరీర్‌ను ప్లాన్ చేసేటప్పుడు అతను ఎంత వెనుకబడి ఉన్నాడో దీనిని బట్టి అంచనా వేయొచ్చు. ఇక ఆచార్య చిత్రంలో చిరుతో పాటు ఓ కీలక పాత్ర పోషిస్తున్న చరణ్.. ఆపై సినిమాని ప్రకటించడానికి ఎందుకంత సమయం తీసుకుంటున్నాడు? అన్నది సస్పెన్స్ గా మారింది. ఏదేమైనా ఇతర హీరోలు సక్సెస్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లను తమ ఖాతాలో వేసుకుని దూసుకుపోతుంటే చెర్రీ మాత్రం ఎందుకనో దారుణంగా వెనకబడ్డాడు. ఇతర స్టార్ హీరోలంతా పాన్ ఇండియా రేంజు పాన్ వరల్డ్ రేంజు అంటూ దూసుకుపోతుంటే చరణ్ ఎందుకింత దారుణంగా విఫలమయ్యాడు? అన్నది మెగాభిమానుల సందేహం. మరి దీనికి ఆయనే సమాధానం చెబుతారేమో!