అదే ప్లేస్ లో “RC16”.. చరణ్ హిస్టరీ రిపీట్ చేస్తాడా??

ప్రస్తుతం మన తెలుగు సినిమా స్టార్స్ లో పాన్ ఇండియా వైడ్ గా కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోస్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకడు. కాగా చరణ్ హీరోగా ఇప్పుడు భారీ సినిమా దర్శకుడు శంకర్ తో చేస్తుండగా ఈ సినిమా షూటింగ్ ని తాను ఆల్ మోస్ట్ ఫినిషింగ్ కి తీసుకొచ్చేసాడు.

కాగా ఈ భారీ చిత్రం అనంతరం మరో మాసివ్ చిత్రం దర్శకుడు “ఉప్పెన” ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానాతో చేస్తుండగా ఈ చిత్రం కోసం కూడా గట్టి అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాని పక్కా ప్లానింగ్ ప్రకారం షేప్ అవుట్ చేస్తుండగా ఈ సినిమా విషయంలో కొన్ని ట్రస్టుడ్ వర్గాల నుంచి ఆసక్తికర అంశాలు వినిపిస్తున్నాయి.

దర్శకుడు బుచ్చిబాబు ఎవరి శిష్యుడో తెలిసిందే. దర్శకుడు సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన తాను ఉప్పెనతో గురువుకి తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు. మరి అదే సుకుమార్ తో రామ్ చరణ్ చేసిన మొదటి సినిమా “రంగస్థలం” తెలుగు సినిమా దగ్గర ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.

కాగా ఈ చిత్రంకి వేసిన పలు భారీ సెట్టింగ్స్ ఏరియా లోనే ఇప్పుడు బుచ్చిబాబు చిత్రానికి కూడా సేమ్ ప్లేస్ లో సెట్టింగులు హైదరాబాద్ లో వేస్తున్నారట. దీనితో సెంటిమెంట్ గా మళ్ళీ రామ్ చరణ్ హిస్టరీ క్రియేట్ చేస్తాడు అని మెగా ఫ్యాన్స్ భావిసున్నారు. మరి నిజంగానే ఈ బిగ్ ప్రాజెక్ట్ కూడా రంగస్థలం రేంజ్ లో హిట్ అవుతుందో లేదో చూడాలి.