R.K.Sagar: మొగలిరేకులు సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు ఆర్కే సాగర్. ఆర్కే సాగర్ కంటే కూడా తనని ఆర్కే నాయుడు అని పిలిస్తేనే ఎంతోమంది సులభంగా గుర్తుపడతారు. మొగలిరేకులు సీరియల్ లో ఆర్కే నాయుడు మున్నా పాత్రలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సాగర్ మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమా ద్వారా వెండి తెరపై సందడి చేశారు అయితే ఈ సినిమా తనకు ఏమాత్రం గుర్తింపు తీసుకురాలేదని చెప్పాలి.
ఈ సినిమా తర్వాత ఆర్కే సాగర్ ప్రస్తుతం వరుస సినిమాలలో హీరోగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. త్వరలోనే ఈయన ది 100 అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో కూడా ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇలా ఈ సినిమా జులై 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఆర్కే సాగర్ వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాగర్ తన కెరియర్ లో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా విషయంలో ఎప్పుడు రిగ్రేట్ గానే ఫీల్ అవుతానని తెలిపారు. ఈ సినిమాలో నా పాత్ర సెకండ్ లీడ్ అని చెప్పి చివరికి ఎలాంటి ప్రాధాన్యత లేని క్యారెక్టర్ ఇచ్చారని సాగర్ అసలు విషయం బయటపెట్టారు. అదేవిధంగా ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో కూడా తనకు అవకాశం వచ్చిందని తెలిపారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అన్నయ్య పాత్రలో నటించే అవకాశం వచ్చింది.
రామ్ చరణ్ అన్నయ్య పాత్ర కోసం సుకుమార్ తనని సంప్రదించగా తాను మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమా విషయంలో జరిగిన సంఘటనలను చెప్పాను.కానీ అలా జరగదని సుకుమార్ చెప్పారు. నేను ఆ క్యారెక్టర్ ఒప్పుకోలేదు. నేను నో చెప్పడంతో ఆది పినిశెట్టికి చెప్పారు. ఆయన కూడా మొదట ఒప్పుకోలేదు. అది నాకు తెలిసి నేను చేద్దాం అనిపించి సుకుమార్ గారికి ఆ పాత్రకు ఓకె చెప్పాను. కానీ ఆది పినిశెట్టి కూడా ఓకే చెప్పడంతో ఆయన ఫైనల్ అయ్యారని లేకపోతే రంగస్థలం సినిమాలో చరణ్ అన్నయ్య పాత్రలో నేనే నటించాల్సి ఉండేది అంటూ సాగర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
