ఇండస్ట్రీ టాక్ : రామ్ చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్ అప్పుడు స్టార్ట్?

తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ దర్శకుల్లో తన సినిమాలతో క్రియేటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి కూడా ఒకరు. మరి లవ్ సినిమాలు అయినా లాజికల్ సినిమాలు అయినా అలాగే మాస్ సినిమాలు అయినా కూడా ఓ రేంజ్ లో తీస్తున్న సుకుమార్ ఇప్పుడు పుష్ప 2 అనే భారీ పాన్ ఇండియా సినిమాని చేస్తున్నాడు.

కాగా ఈ చిత్రం తర్వాత సుకుమార్ చేసే సినిమా ఏంటి అనేది కేజ్రీగా మారగా ఎప్పుడు నుంచో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో మరో సినిమా చేస్తాడు అనే టాక్ గట్టిగా ఉంది. కాగా ఇది వరకే వీరి కాంబినేషన్ నుంచి వచ్చిన “రంగస్థలం” చిత్రం పెద్ద హిట్ గా నిలవగా ఈ సినిమా తర్వాత చేసే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని ఆ ఒక్క సినిమా కోసం మాత్రం తనకు చాలా ఎదురు చూస్తున్నాను అని దిగ్గజ దర్శకుడు జక్కన్న రాజమౌళినే తెలిపాడు.

మరి ఆ రేంజ్ లో హైప్ ఉన్న ఈ చిత్రానికి ఐతే దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ ని లాక్ చేసేసినట్టుగా సినీ వర్గాల్లో ఫ్రెష్ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. కాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే మేకర్స్ స్టార్ట్ చేస్తారు అంటూ ఇంకో క్రేజీ న్యూస్ బయటకి వచ్చింది. ఈ ఏడాది చివరిలో రామ్ చరణ్ 17వ సినిమా అయితే తెరకెక్కుతుంది అని గట్టిగా వినిపిస్తుంది. మరి ఈ సెన్సేషనల్ కాంబినేషన్ పై ఇంకాస్త క్లారిటీ రావాల్సి ఉంది.