Aadi pinishetty: సినీ నటుడు ఆది పినిశెట్టి ప్రస్తుతం శబ్దం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా రంగస్థలం సినిమాలో కొన్ని సన్నివేశాల గురించి ఈయన మాట్లాడారు రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ కు అన్న పాత్రలో ఆది పినిశెట్టి నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఆది పాత్ర చనిపోతుంది.
ఇలా నేను చనిపోయినప్పుడు షూటింగ్ చేసే సమయంలో కాస్త భయపడ్డానని ఆది పినిశెట్టి తెలిపారు.. నాకు తల్లి పాత్రలో నటి రోహిణి గారు నటించారు. అయితే ఈ పాత్ర షూటింగ్ జరిగేటప్పుడు నేను కళ్ళు మూసుకొని అలా ఉండిపోయాను కానీ రోహిణి గారు సమంత ఇద్దరూ నిజంగానే ఎమోషనల్ అవుతూ ఏడ్చేశారు వాళ్లు ఏడుపు విని నేను భయపడిపోయానని ఆది పినిశెట్టి తెలిపారు.
రోహిణి గారు నటుడు రఘువరన్ మరణ వార్తను తలుచుకుని ఏడ్చేశారు. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత నేను నాన్న ఇద్దరం కలిసి థియేటర్లో ఈ సినిమా చూశాను నాన్న దర్శకుడుగా ఇలాంటి ఎన్నో సన్నివేశాలను చేసి ఉంటారు కానీ ఈ సన్నివేశం రాగానే ఆయన కూడా ఎంతో ఎమోషనల్ అవుతూ ఏడ్చేశారు. నన్ను అలా చూసి తట్టుకోలేకపోయారు.
నాన్న ఈ సన్నివేశం చూస్తూ ఎమోషనల్ అవుతున్న సమయంలో నేను నాన్న చేతిని పట్టుకొని నేను నీ పక్కనే ఉన్నాను నాన్న అది కేవలం ఒక సీన్ మాత్రమే అంటూ నాన్నను ఓదార్చినట్టు ఆది పినశెట్టి తెలిపారు. కేవలం వీరు మాత్రమే కాదు థియేటర్లలో కూడా ఎంతోమంది ప్రేక్షకులు ఈ సన్నివేశానికి ఆ సమయంలో వచ్చే పాటకు ఎంతగానో కనెక్ట్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పాలి. ఇలా రంగస్థలం సినిమాలోని ఈ సన్నివేశం గురించి ఆది చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.