మహేష్ బాబు…కత్రినా కైఫ్ కు మేల్ వెర్షనా?

మహేష్ బాబు  కొన్ని సినిమాల్లో హాలీవుడ్ స్దాయిలో నటన చూపించారు. అలాంటి మహేష్ కు నటన రాదని, ఎక్సప్రెషన్స్ పలకవని ఎవరైనా అనగలరా… కానీ అనేసాడు ఓ కమిడయన్ …అవును…తమిళనాడుకు చెందిన  మనోజ్ ప్రభాకర్ అనే స్టాండప్ కమిడయన్…నోటికి వచ్చిందల్లా వాగేసాడు. కత్రినాకైఫ్ లాగే మహేష్ బాబు అందంగా ఉంటాడు. కానీ..ఆమెలాగే నటన శూన్యం అన్నాడు.  మహేష్ బాబు మరెవరో కాదు కత్రినాకు మేల్ వెర్షన్ అని దరిద్రమైన పోలిక చేసాడు. మనోజ్ స్టాండప్ షోలకు యూట్యుబ్ లో మంచి క్రేడ్ ఉంది. దాంతో అతని కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. 
 
ఇవన్నీ మాట్లాడటానికి ఎగ్జాంపుల్ గా రీసెంట్ గా విడుదలైన స్పైడర్ సినిమా ఉదాహరణగా తీసుకున్నాడు. స్పైడర్ లో విలన్ గా కనిపించిన ఎస్ జె సూర్య తన నటనతో అదరకొడుతూంటే మహేష్ మాత్రం అలా నిలబడిపోయాడని విమర్శలు చేసాడు. స్పైడర్ సినిమా ప్లాఫ్ సినిమానే కానీ ..అందులో కూడా మహేష్ తన స్దాయి నటనకు ఏ మాత్రం తగ్గకుండా చేసుకుంటూ పోయాడనేది నిజం. అయితే అదేమీ చూసుకోకుండా నోటికొచ్చిన వాగుడు వాగటం మహేష్ అభిమానులకు ఏ మాత్రం నచ్చటం లేదు.  
 
అయితే మనోజ్ కేవలం మహేష్ ని విమర్శించటమే కాకుండా మహేష్ ఫ్యాన్స్  ఆ మద్యన టామ్ క్రూజ్ పేజీలో రచ్చ రచ్చ చేసిన విషయాన్ని గుర్తు చేసి మరీ దెప్పి పొడిచాడు. జోకులు వేసాడు.  మహేష్ బాబుతో పనిచేసే డైరక్టర్స్ అంతా ఎక్సప్రెషన్ ఇవ్వమంటూ బ్రతిమిలాడతారంటూ కౌంటర్స్ వేసాడు. ఇదంతా చూసిన మహేష్ ప్యాన్స్ కు కాలుతోంది. 
 
ఏదీ నువ్వు తమిళ హీరో విజయ్ ని వెటకారం చెయ్యి చూద్దాం..అతని ఎక్సప్రెషన్స్ గురించి మాట్లాడు వింటాం అంటున్నారు. అయినా తమిళ టాప్  డైరక్టర్స్ వచ్చి మహేష్ ని తమ సినిమాల్లో చేయమని బ్రతిమిలాడుతున్న సంగతి ఈ కమిడియన్ మర్చిపోయినట్లున్నాడు. అతను మెచ్చుకుంటున్న ఎస్ జె సూర్య కూడా తెలుగులో మహేష్ తో ఓ పెద్ద ఫ్లాఫ్ సినిమా చేసాడు. మహేష్ ఓకే చేయబట్టే స్పైడర్ లో విలన్ గా చేసాడు. అవునా కాదా..?