సైరా హక్కుల్లో దిల్ రాజు గ్యాంబ్లింగ్
ఆగస్టు 30న `సాహో` అత్యంత క్రేజీగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రిలీజ్ కి రెడీ అవుతున్న మరో భారీ బడ్జెట్ చిత్రం `సైరా`. అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ కి అద్భుత స్పందన వచ్చింది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ సహా అన్ని మెట్రో నగరాల్లో భారీ ప్రచార కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
మరోవైపు సైరా పంపిణీ హక్కుల విషయంలో డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో తీవ్రమైన పోటీ నెలకొందని తెలుస్తోంది. ముఖ్యంగా సైరా ఉత్తరాంధ్ర రిలీజ్ హక్కుల విషయంలో సీనియర్ పంపిణీదారుడు క్రాంతి రెడ్డికి .. ప్రముఖ నిర్మాత ఎగ్జిబిటర్ దిల్ రాజు మధ్య తీవ్రమైన పోటీ నెలకొందని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర రిలీజ్ హక్కుల కోసం క్రాంతి రెడ్డి 14.5 కోట్లు చెల్లించేందుకు సిద్ధమయ్యారట. ఈ డీల్ ఓకే అయిపోయింది అనుకుంటున్న టైమ్ లో దిల్ రాజు మోకాలడ్డారని చర్చించుకుంటున్నారు. ఆ డీల్ పూర్తి కాకుండా తాను తీవ్రమైన పోటీ పెట్టారని తెలుస్తోంది. దాదాపు 15- 16 కోట్లు చెల్లిస్తామని కొణిదెల కంపెనీతో దిల్ రాజు మాట్లాడుకున్నారట. దీంతో క్రాంతి రెడ్డిని కాదనుకుని రాజు గారికే కట్టబెట్టేందుకు కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ సిద్ధమైందన్న ముచ్చటా సాగుతోంది. అయితే దిల్ రాజు కంటే ప్రత్యర్థులు చిరంజీవి – రామ్ చరణ్ లకు ఎంతో క్లోజ్. కానీ బిజినెస్ వ్యవహారంలో లాభాల్ని మాత్రమే చూస్తున్నారా? అంటూ ఆసక్తికరంగా ముచ్చటించుకుంటున్నారు.