క్రిష్ సినిమా విడుద‌ల‌కు ముహూర్తం ఫిక్స్.. ఇక మేలో ర‌చ్చ ర‌చ్చే..!

క‌రోనా వ‌ల‌న దాదాపు ఏడు నెల‌ల పాటు ఆగిన సినిమాలు ఇప్పుడు థియేట‌ర్స్ వైపు క్యూ క‌డుతున్నాయి. చాలా చిత్రాలు ఇప్ప‌టికే రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌గా, ఇప్పుడు మ‌రో మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. మ‌రి ఆ మూవీ మ‌రేదో కాదు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు.. క్రేజీ సినిమాలు తీసే క్రిష్ కాంబినేష‌న్‌లో రూపొందిన 101 జిల్లాల అంద‌గాడు. ఈ పేరు చాలా క్యాచీగా ఉండ‌డంతో పాటు జ‌నాల‌ను థియేట‌ర్స్ వైపుకు త‌ప్పక ర‌ప్పిస్తుంద‌ని అంటున్నారు.

క్రిష్ సినిమా అంటేనే అభిమానుల‌లో చాలా అంచ‌నాలు ఉంటాయి. ఇక ఆయ‌న‌కు దిల్ రాజు జ‌త అయితే అంచ‌నాలు భారీగా ఉంటాయి. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న 101 జిల్లాల అందగాడు సినిమాను మే 7న విడుద‌ల‌కు నిర్ణయించినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ సినిమా మంచి కంటెంట్ తో రూపొందుతున్నట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌డంతో పాటు మంచి వ‌సూళ్ళు రాబ‌ట్టడం ఖాయ‌మ‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.

101 జిల్లాల అంద‌గాడు సినిమాకు దిల్ రాజు మరియు క్రిష్ లు సమర్పకులుగా శిరీష్ మరియు రాజీవ్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్నాడు. ఇక న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా అల‌రిస్తున్న అవ‌స‌రాల శ్రీనివాస్ ఇందులో ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండ‌గా, ఆయ‌న స‌ర‌స‌న చి.ల.సౌ చిత్ర హీరోయిన్ రుహాని శర్మ న‌టిస్తుంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఇదిలా ఉంటే క్రిష్ .. వైష్ణ‌వ్ తేజ్ హీరోగా కూడా ఓ సినిమా తెర‌కెక్కించాడు. ఈ మూవీ విడుద‌లకు సిద్దంగా ఉంది. మ‌రోవైపు ప‌వ‌న్‌తో ఓ సినిమా చేస్తుండ‌గా, దాదాపు ఈ చిత్రాన్ని కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయ‌నున్నాడు.