Vakeel saab : వకీల్ సాబ్ విషయంలో దిల్ రాజు ప్లాన్స్ వర్కౌట్ కావడం లేదా ..?

Vakeel saab : వకీల్ సాబ్ విషయంలో దిల్ రాజు చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా వెలుగుతున్న దిల్ రాజు కి దాదాపు 10 ఏళ్ళ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలన్నది పెద్ద డ్రీం. అయితే ఆ డ్రీం నెరవేర్చుకోవడానికి గతంలో చాలా సార్లు ట్రై చేశాడు. కాని కుదరలేదు. ఎట్టకేలకి మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ ఇస్తున్న రీ ఎంట్రీ సినిమాతో దిల్ రాజు తన కల నెరవేర్చుకున్నట్టే. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమాని వకీల్ సాబ్ గా పవన్ కళ్యాణ్ తో నిర్మించాడు. ఈ ప్రాజెక్ట్ లో బోనీకపూర్ కూడా భాగం కావడం కూడా తెలిసిందే.

ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉంటుండటం తో షెడ్యూల్స్ ఉన్నప్పుడు ప్రత్యేకంగా ట్రావెలింగ్ ఏర్పాట్లు కూడా చేశాడు. బడ్జెట్ కూడా అనుకున్నదానికంటే పెరిగిందన్న టాక్ కూడా ఉంది. అయినా మొండి ధైర్యంతో దిల్ రాజు పవన్ కళ్యాణ్ కోసం భారీగా ఖర్చు చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం వకీల్ సాబ్ తో పాటు రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాల బిజినెస్ కి సంబంధించిన వార్తలు ఏదో ఒక న్యూస్ వస్తోంది. ప్రభాస్ రాధే శ్యాం ఇప్పటికే భారీ స్థాయిలో నైజాం థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయని చెప్పుకుంటున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా బిజినెస్ కూడా జరుగుతుందని ఏవో లెక్కలు చెబుతున్నారు.

Vakeel saab : వకీల్ సాబ్ రిజల్ట్ తేడా కొడితే మాత్రం దిల్ రాజుకి కష్టమేనట..!

కాని అసలు వకీల్ సాబ్ సినిమాకి సంబంధించిన బిజినెస్ అప్‌డేట్ మాత్రం రావడం లేదు. విచిత్రం ఏమిటంటే దిల్ రాజు నిర్మిస్తున్న ఎఫ్ 3 సినిమా బిజినెస్ కూడా జరిగిపోయిందని వార్తలు వచ్చాయి. ఆ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఎప్పుడో ఆగస్టు లో రిలీజ్ చేస్తున్నారు. కాని వకీల్ సాబ్ సినిమా విషయంలో మాత్రం పక్కాగా ఏమీ తెలియడం లేదు. ఇదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్రంగా చర్చించుకుంటున్నారట. అయితే ఇప్పటికే రెండు భాషల్లో రిలీజైన సినిమా కాబట్టి పెద్దగా బిజినెస్ జరగడం లేదని మాట వినిపిస్తోంది. దిల్ రాజు కూడా చాలా ప్లాన్స్ వేస్తున్నాడట. కాని ఏదీ వర్కౌట్ కావడం లేదని చెప్పుకుంటున్నారు. ఒకవేళ వకీల్ సాబ్ రిజల్ట్ తేడా కొడితే మాత్రం దిల్ రాజుకి కష్టమేనట.