బండ్ల గణేష్ కుటుంబం సేఫేనట
ఉన్నట్టుండి నటుడు కం నిర్మాత బండ్ల గణేష్ కి కరోనా పాజిటివ్ అని తెలియగానే టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓవైపు షూటింగులకు వెళ్లాలని అంతా సిద్ధమవుతుండగా అంతా షాక్ తిన్నారు. ఇలా అయితే కష్టమే.. సెట్స్ కి వెళితే మహమ్మారీ ముప్పు ఖాయమేనని ఫిక్సయిపోయారు.
ఇంతకీ గణేష్ సేఫేనా? ఆయన కుటుంబం సేఫేనా? అంటే ఈ రెండిటికీ అట్నుంచి సేఫే అన్న సమాధానం వచ్చింది. బండ్ల స్వయంగా సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం వెల్లడించారు. అలాగే తనపు సాగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని బండ్ల తెలిపారు. అన్నట్టు బండ్ల వల్ల ఓ యువహీరోకి అంటుకునే ప్రమాదం ఉందని ప్రచారమైంది. ఇంతకీ ఆయన సేఫేనా? అతడు ఫామ్ హౌస్ కి వెళ్లారని కూడా ప్రచారమైంది. మరి అతడి నుంచి కూడా రిప్లయ్ రావాల్సి ఉంటుంది. మొత్తానికి బండ్ల వల్ల చాలామంది టెన్షన్ పడ్డారు. వాళ్లంతా సేఫేనని భావిద్దాం.