ప్చ్.. బాలయ్య కొట్టుడుకు నలభై కోట్లు ! 

బాలయ్య బాబు ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘మోనార్క్’ అనే మరో రొటీన్ యాక్షన్ కొట్టుడు సినిమా ఒకటి చేస్తున్నాడు. ఈ సినిమా కూడా బాలయ్య రెగ్యులర్ సినిమాలు లాగే పసలేని యాక్షన్ సీన్స్ లతో, అరిగిపోయిన వార్నింగ్ డైలాగ్సేతోనే సాగుతుందట. డైలాగ్ రైటర్ ఎమ్ రత్నం మాటల్లో ఈ సినిమా బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతుందట. అంటే మిగిలిన వారికీ నచ్చదు అని ఆయన ఇన్ డైరెక్ట్ గా చేబుతునట్లు ఉంది. అయినా, ఈ డిజిటల్ జనరేషన్ లో కూడా బోయపాటి పాత చింతకాయ పచ్చడి సీన్స్ తోనే బండి నడిపేయాలని కిందామీద పడుతుండటం చూస్తుంటే, ఇక బోయపాటి సినీ కెరీర్ కి ఎండింగ్ బెల్ మోగినట్టే.

అసలు బాలయ్యకైనా కథల జడ్జ్ మెంట్ లో కనీస అవగాహనైనా ఉండాలి కదా. ప్రతి సినిమాలోనూ అదే కత్తి పట్టి శత్రువుల తలలు నరిగే సీన్స్ తోనే హిట్ కొట్టాలనుకోవడం బాలయ్య అమాయికత్వానికి సింబాలిజమ్ అని మనం సరిపెట్టుకోవాలేమో. ఆ మధ్య బాలయ్య గెటప్ ను రివీల్ చేస్తూ చిత్రబృందం విడుదల చేసిన టీజర్ ను చూశాక కూడా… వీళ్ళ సినిమా నుండి కొత్తదనం ఆశించడం అత్యాశే అవుతుంది. మెయిన్ గా బాలయ్య సినిమా అంటేనే కొట్టుడు తప్ప కొత్తదనం ఏం ఉండదని.. బాలయ్య కొట్టుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలడని తెలుగు ప్రజానీకం కూడా మెంటల్ గా ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నారు. అందుకే బాలయ్య సినిమాలను దాదాపు చూడటమే మానేశారు.

అందుకే గత కొన్ని సినిమాలుగా బాలయ్య సినిమాలు కనీసం పది కోట్లు కూడా కలెక్ట్ చేయలేదంటే.. బాక్సాఫీస్ వద్ద బాలయ్య దీనస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు చేస్తోన్న సినిమా విషయానికి వస్తే.. తరువాత షెడ్యూల్ హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో అక్టోబర్ ఫస్ట్ వీక్ నుండి షూట్ జరుగనుంది. ఈ షెడ్యూల్ లో కేవలం బాలయ్య మీద సోలో సాంగ్ ను మాత్రమే షూట్ చేయనున్నారు. అది కూడా అతి తక్కువఅమంది సిబ్బందితో. ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్ ను కూడా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అన్నట్టు ద్వారక క్రియేషన్స్‌ పతాకం పై నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. పాపం మిర్యాల రవీందర్‌రెడ్డి సుమారు నలభై కోట్లు ఖర్చు పెడుతున్నాడు. బాలయ్య కొట్టుడుకు నలభై కోట్లు వర్కౌట్ అవుతుందా.. ఆ రవీందర్‌రెడ్డికే తెలియాలి.