ఇండస్ట్రీ టాక్ : పవన్ కళ్యాణ్ అప్పుడు వరకు కనిపించడట..!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ తన రాజకీయ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే మరోపక్క పవన్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన సినిమాలు అయితే ప్రశ్నార్ధకంగా మారాయి. మరి వీటిపై అయితే పవన్ మళ్ళీ దృష్టి పెట్టనున్నాడని సినీ వర్గాల్లో టాక్ ఉంది.

అయితే పవన్ రీసెంట్ గా తన సోదరుడు మెగా స్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం “గాడ్ ఫాదర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ రావడం ముందు ఫిక్స్ అయ్యింది. కానీ తర్వాత పవన్ మళ్ళీ ప్లాన్ వేరేగా ఉండడంతో ఈ ఈవెంట్ ని తాను మిస్ అయ్యారు.

అయితే ఇపుడు పవన్ ప్రోగ్రెస్ కి సంబంధించి అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం పవన్ ఇప్పుడు తన పర్సనల్ వర్క్స్ లో బిజీగా ఉన్నాడట. అందుకే ఈ అక్టోబర్ 5 వరకు మళ్ళీ పవన్ బయట కనిపించడని తెలుస్తుంది. మళ్ళీ దసరాకే పవన్ అయితే దర్శనం ఇస్తాడట.

ప్రస్తుతం అయితే పవన్ దర్శకుడు క్రిష్ తో హరిహర వీరమల్లు అనే భారీ సినిమా చేస్తున్నాడు. అలాగే దీని తర్వాత ఓ రీమేక్ అలాగే మరో సినిమా దర్శకుడు హరీష్ శంకర్ తో చేయనున్నాడు.