స్వ‌ర్గ‌స్తులైన‌ దర్శకుడు ఇంద్రగంటి తండ్రి

ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌. చివ‌ర‌గా స‌మ్మోహ‌నం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించిన ఆయ‌న ప్ర‌స్తుతం నాని, సుధీర్ బాబు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వీ అనే చిత్రం తెర‌కెక్కిస్తున్నాడు. అయితే ఆయ‌న తండ్రి ఇంద్రగంటి శ్రీకాంతశర్మ (75) గురువారం తెల్లవారుఝామున హైదరాబాద్‌లో క‌న్నుమూశారు.

ప్ర‌ముఖ క‌వి, సాహితీవేత్త‌గా సాహిత్య లోకానికి ఆయ‌న ఎన్నో సేవ‌లు చేశారు. ల‌లిత గేయాలు, క‌విత‌లు, రేడియో నాటిక‌లు, డాక్యుమెంట‌రీలు, సంగీత రూపకాల‌ని ఆయ‌న ర‌చించారు. స‌మ్మోహ‌నం చిత్రంలో ‘మనసైనదేదో’ అనే పాట ఆయ‌న క‌లం నుండి జాలువారింది.

మే 29,1944న తూర్పు గోదావ‌రి జిల్లా రామ‌చంద్రాపురంలో జ‌న్మించిన‌ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఈ రోజు అనారోగ్యం కార‌ణంతో క‌న్నుమూశారు. ఆయ‌న మృతికి ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.