ఇలియానా స్ట‌న్నింగ్ జిమ్ లుక్ మ‌తి చెడాల్సిందే

ileana big Offer with netflix and altbalaji web series !

అందాల ఇలియానా సోష‌ల్ మీడియాల్లో ఎంత స్పీడ్ గా ఉంటుందో తెలిసిందే. నిరంత‌రం జిమ్ యోగా చేస్తూ వేడెక్కించే సెల్ఫీల‌ను ఇన్ స్టాలో షేర్ చేస్తోంది. ప్రియుడు ఆండ్రూ నీబోన్ లేక‌పోయినా స్వ‌యం సెల్ఫీ ఫోటోగ్రఫీలో ఆరితేరిన ఇలియానా స్ట‌న్నింగ్ ఫోటోలతో విరుచుకుప‌డుతోంది.

తాజాగా ఈ అమ్మ‌డు షేర్ చేసిన జిమ్మింగ్ సెల్ఫీలు అంత‌ర్జాలాన్ని వేడెక్కిస్తున్నాయి. టైట్ బ్లాక్ ట్రాక్ లో ఒంటి సొగ‌సును క‌మ్మేసిన ఎల్లో లేస్ టాప్ తో దుమ్ము దులిపేసింది. ఇల్లీ బ్యూటీ ఇన్ స్టా ఫోటోలు ప్ర‌స్తుతం యువ‌త‌రంలో వైర‌ల్ అవుతున్నాయి.

ఇక ఈ జిమ్మింగ్ ఫోటోల‌తో పాటు ఇలియానా 2020 లో ప్ర‌తి నెలా ఎలాంటి ఎమోష‌న్ కి గుర‌వుతోందో ఆవిష్క‌రిస్తూ రిలీజ్ చేసిన ఓ ఫోటోని త‌నే స్వ‌యంగా షేర్ చేసి `సో ఫ‌న్నీ` అంటూ క్యాప్ష‌న్ ని ఇచ్చింది. ఎవ‌రో అభిమాని షేర్ చేసిన ఈ ఫోటో అభిమానుల్ని ఆక‌ట్టుకుంటోంది. ఇక ఇల్లీ కెరీర్ సంగ‌తి చూస్తే.. ప్ర‌స్తుతం అభిషేక్ బ‌చ్చ‌న్ స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టిస్తోంది. తెలుగులో న‌టించేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంద‌ని స‌మాచారం.