డార్లింగ్ ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అమెరికాలోనూ అతడికి వీరాభిమానులున్నారు. ఇకపోతే మిర్చి ఫేం రిచా గంగపోధ్యాయ ప్రస్తుతం అమెరికాలోనే ఉంటోంది. మిర్చి..మిరపకాయ్..భాయ్ లాంటి సినిమాల్లో నటించిన ఈ భామ కెరీర్ లో నిలదొక్కుకోవడంలో విఫలమైంది. అవకాశాలు ముఖం చాటేయడంతో విసిగిపోయి… చివరికి గుడ్ బై చెప్పి అమెరికా వెళ్లి మాస్టర్స్ చదివింది. బిజినెస్ స్కూల్ లో స్నేహితుడు అయిన క్లాస్ మేట్ జో లాంగెల్లాను పెళ్లి చేసుకుని ఓ ఇంటిదైంది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులకు టచ్ లో ఉంటూనే ఉంది.
తాజాగా కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ట్విట్టర్ లో అభిమానులతో సరదా ముచ్చట్లకు దిగింది. అయితే అక్కడ ఫ్యాన్స్ ముందు ఊహించని విధంగా ఇరకాటంలో పడింది. ఓ అభిమాని ప్రభాస్ తో మీరు ఓ సినిమా చేసారు కదా. అతని గురించి చెప్పండి.. అంటూ అడిగాడు. “ప్రభాస్ నిజంగా అద్భుతమైన వ్యక్తి. చాలా వినయంగా ఉంటాడు. నాకిష్టమైన నటుడు“ అని రిచా అంది. మరో అభిమాను కూడా ప్రభాస్ అన్నయ్య గురించి ఒక్క మాట చెప్పండి.. అని రెట్టించి అడిగాడు. దీనికి విసిగిపోయిన రిచా ఒకే ప్రశ్న ఎన్నిసార్లు అడుగుతారు? ఇప్పటికే మీకు చెప్పానుగా అంటూ బుంగ మూతి పెట్టేసింది.
దీంతో మరో అభిమాని మా వాళ్లకి ప్రభాస్ అంటే పిచ్చేలే అక్క. నువ్వు అవేవీ పట్టుంచుకోకు అంటూ కవర్ చేసేశాడు. దానికి స్పందనగా “తెలుసులే తమ్ముళ్లు` అనేసింది రిచా. దీనికి ఓ ఆకతాయి “రిచా అక్క అయితే..ప్రభాస్ బావ అవుతాడు` అనేశాడు. దానికి రిచా కూడా పెద్దగా సీరియస్ అవ్వలేదు. లైట్ తీసుకుని అప్పటికి చాటింగ్ చాలు అంటూ గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం రిచా వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతోంది. పెళ్లి తర్వాత అమెరికాలోనే స్థిరపడింది.