అలా చేస్తే మనసంతా నువ్వే ఫ్లాప్ అయ్యేదా.. బయటపడ్డ షాకింగ్ నిజాలు!

మనసంతా నువ్వే చిత్రం బి.ఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన తెలుగు భాషా రొమాంటిక్ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్, రీమాసేన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని రచించి, నిర్మించింది ఎమ్. ఎస్ రాజు. ఇక ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు ఆర్. పి. పట్నాయక్.

ఇక అసలు విషయానికి వస్తే నిర్మాత ఎమ్మెస్ రాజుకు ఒక కొత్త దర్శకుడితో క్యూట్ లవ్ స్టోరీ తీయాలని కోరికతో కెమెరామెన్ ఎస్. గోపాల్ రెడ్డితో విషయం చెప్పారట. అప్పుడు బి.ఎన్ ఆదిత్య అని చాకు లాంటి కుర్రాడు ఉన్నాడు అంటూ అతని ఫోన్ నెంబర్ ఇస్తే రాజుగారు ఫోన్ చేశారట.

బి. ఎన్ ఆదిత్య, ఎమ్మెస్ రాజుతో మీరేమో పెద్ద నిర్మాత.. పైగా మీరు లవ్ స్టోరీలు ఇంతవరకు తీయలేదు. నా కథను మీరు ఎలా జడ్జ్ చేస్తారో అంటూ కాస్త అనుమానంగా మాట్లాడితే.. రాజుగారు.. ప్రశాంతంగా పది రోజులు నాతో కలిసి ట్రావెల్ చేస్తే ఇద్దరం స్క్రిప్టులో మార్పులు చేసుకొని సినిమా చేద్దాం అన్నాడు. ఇక నిర్మాత రాజుగారు హిందీలో వచ్చిన అన్మొల్ ఘడి తరహాలో ఉండాలి కథ అంటే ఓకే చెప్పేశాడు ఆదిత్య.

ఇద్దరు కలిసి కథ తయారు చేసుకుని పరుచూరి బ్రదర్స్ కు వినిపించగా వెంటనే పరుచూరి గోపాలకృష్ణ గారు సెకండ్ హాఫ్ లో చైల్డ్ హుడ్ గురించి అంత ఎక్కువగా చూపిస్తే సినిమా హిట్ అవ్వడం కష్టం అని తేల్చి చెప్పేశారు. మళ్లీ కష్టపడి మార్పులు చేర్పులు చేసి మొత్తానికి 95 శాతం షూటింగ్ కూడా ఫినిష్ చేసేసారు.

మళ్లీ క్లైమాక్స్ లో తేడా కొట్టడంతో ఇక సినిమా పోయినట్టే అనుకున్నారు. కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడం పొరపాటేమో అని అనుకుంటూ ఉండగా, ఎడిటర్ ఏ.వి. కృష్ణారెడ్డి సినిమాను బాగా అబ్జర్వ్ చేసి చిన్న ఎడిటింగ్ చేసి నిర్మాత ఎమ్మెస్ రాజుకు చూపించారట.

ఆ సినిమాలో మొదట వచ్చే నీ స్నేహం పాటను క్లైమాక్స్ లో కూడా చూపించడం వల్ల సినిమాకు ఎక్కడా లేని డెప్త్ వచ్చిందంటూ సంతోషపడ్డారు అందరు. ఇక ఈ సినిమా దర్శకుడు బి. ఎన్. ఆదిత్య కు మెయిన్ టర్నింగ్ పాయింట్. ఇక ఎమ్మెస్ రాజు నిర్మాతగా ఈ సినిమాతో కొత్త ట్రెండ్ సృష్టించారు. ఇక ఉదయ్ కిరణ్ అయితే ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకున్నాడు.