రైటర్ గా నేను ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు !

15ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. 50 నుంచి 60 సినిమాలకు రచయితగా పనిచేశా. ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లో ‘ఓ బేబీ’ చాలా సంతృప్తినిచ్చింది’’ అన్నారు రచయిత లక్ష్మీభూపాల్‌. ‘చందమామ, అలా మొదలైంది, నేనే రాజు నేనే మంత్రి, కల్యాణ వైభోగమే’ వంటి సినిమాలకు మాటలు రాశా నేను , రచయితగా తన జర్నీ గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘నేను యాక్సిడెంటల్‌ రైటర్‌ని. 1994 నుంచి టీవీ, మీడియా రంగంలో ఉన్నాను. 2004లో నటుడు లక్ష్మీపతిగారి ద్వారా మాటల రచయితగా మారాను.

అనుభవించవలసిన కష్టాలన్నీ ముందే పడ్డాను.. అందుకే సినిమా ప్రయాణం సాఫీగా సాగినట్టుంది(నవ్వుతూ). ఫస్ట్‌ ‘సోగ్గాడు’ సినిమాకు మాటలు రాశాను. అప్పటినుంచి వరుసగా సినిమాలు రాస్తూనే ఉన్నాను. పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగా రాయలేదు. కానీ, పెద్ద బ్యానర్లలో సినిమాలకు రాశాను. నేను అందరికీ ఓపెన్‌గానే ఉన్నాను. పెద్ద హీరోల సినిమాలు ఎందుకు రావడం లేదో నాకు తెలియదు. బహుశా పంచ్‌లు, ప్రాసలు రాయనని పిలవట్లేదేమో? ‘ఓ బేబీ’ సినిమా కోసం నేను ప్రత్యేకంగా రాసింది ఏం లేదు. అన్నీ దేవుడు రాయించారనుకుంటాను.
ఓ బేబి సినిమా క్రెడిట్ మొత్తం మా నాయనమ్మకి ఇస్తాను.