పొరపాటున కూడా తులసి మొక్కను ఈ రెండు రోజులలో అస్సలు తాకరాదు!

How-to-Grow-Most-Prolific-Tulsi-Plant2

హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణంలో తులసి మొక్కను నాటి తులసి మొక్కను లక్ష్మీ స్వరూపంగా భావించి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు.ఈ విధంగా తులసి మొక్కకు ఆధ్యాత్మిక పరంగాను ఆరోగ్యపరంగాను ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది.ఇలా ప్రతిరోజు లక్ష్మి స్వరూపంగా భావించే తులసి మొక్కకు ఉదయం సాయంత్రం పూజ చేస్తూ ఉంటార అయితే తులసి మొక్కకు పూజించే సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలని నిపుణులు చెబుతుంటారు.అయితే తులసి మొక్కను ప్రతిరోజు తాకుతూ పూజ చేయకూడదు ఈ రెండు రోజుల మాత్రం పొరపాటున కూడా తులసి మొక్కను తాకరాదని పండితులు చెబుతున్నారు.

ముఖ్యంగా చాలామంది తులసి ఆకులను కత్తిరిస్తూ ఉంటారు ఇలా తులసి ఆకులను కత్తిరించే సమయంలో ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. శాస్త్రం ప్రకారం తులసి మొక్కను సూర్యాస్తమయం సూర్యోదయం సమయంలో అసలు తాకకూడదని చెబుతారు.ఈ విధంగా రాత్రి సమయంలో తులసి మొక్కను తాకటం వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు.

ఇక ప్రతిరోజు ఉదయం పూజ చేసే సమయంలోనే తులసి మొక్కకు నీరు పోయాలి కానీ సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కకు ఎలాంటి పరిస్థితులలోనూ మీరు పోయకూడదు ఆ సమయంలో విష్ణు లక్ష్మీదేవి తులసి చెట్టు కింద సేద తీరుతూ ఉంటారని అలా నీళ్లు పోయడం వల్ల వారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఇక ఆదివారం ఏకాదశి ఈ రెండు రోజులలో పొరపాటున కూడా తులసి మొక్కను తాకకూడదు.ఏకాదశి రోజున తులసిదేవి విష్ణువు కోసం నిర్వా వ్రతాన్ని ఆచరిస్తుంది. కాబట్టి ఆ సమయంలో తులసి మొక్కకు నీరు సమర్పించడం వల్ల ఆమె ఉపవాసానికి భంగం కలిగించినట్టు అవుతుందని పండితులు చెబుతున్నారు.