Rajeev Kanakaala: ఒక్క సీన్ కోసం నన్ను 40 సార్లు చైన్నైకి, హైదరాబాద్‌కి తిప్పారు.. రాజీవ్ కనకాల!

Rajeev Kanakaala: సూర్యపుత్రులు సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్క సీన్ కోసం, అదేంటంటే మమ్ముట్టి గారు, సుమన్ గారు కలిసే సీన్ ఒకటి ఉందని, అందులో కామన్ క్యారెక్టర్ తనది అని సినీ నటుడు రాజీవ్ కనకాల అన్నారు. కొంచెం విప్లవ భావాలు గల సుమన్ గారు తనను సపోర్ట్ చేస్తూ, మమ్ముట్టి గారేమో పోలీస్ ఆఫీసర్‌గా నటించారని, ఆ మధ్యలో జరిగే స్వీక్వెన్స్ కోసం ఆ సీన్ క్రియేట్ చేశారని ఆయన చెప్పారు.

ఇక వారిద్దరి మధ్య ఏమైందో నిజంగా తనకు తెలియదు గానీ, లేదంటే వాళ్లిద్దరి డేట్స్ కుదరకపోవడం వల్ల అనుకుంటా, అవి కలవడం కోసం తాను దాదాపుగా 40సార్లు చెన్నైకి వెళ్లానని ఆయన తెలిపారు. ప్రతీరోజూ సాయంత్రం 4.30కి ఫోన్ చేయడం, ఉదయం షూటింగ్ ఉందని, అర్జెంటుగా రావాలని చెప్పడం అని చెప్తే, చెన్నైకి వెళ్లేవాడినని రాజీవ్ చెప్పారు.

తాను చెన్నై అలవాటే ఉన్నా, అక్కడే పెరిగినా కూడా తనకు ఊహ తెలియదు అని రాజీవ్ కనకాల అన్నారు. ఊహ తెలిసే సమయానికి హైదరాబాద్‌కి వచ్చి సెటిల్ అయ్యామని ఆయన చెప్పారు. అక్కడ బస్సు దిగడం, టీ నగర్‌కి వెళ్లి రూంకి వెళ్లడం, ఫ్రెషప్ అయ్యి బయట కూర్చోవడం, పెడితే తినడం లేదంటే అలానే ఉండేవాడినని ఆయన తెలిపారు. కరెక్టుగా మళ్లీ మధ్యాహ్నం తిన్నాక, 4.30 ఆ టైంకి ఫోన్ చేసి, ఈ రోజు లేదమ్మా షూటింగ్, నువ్వు వెళ్లిపో, మళ్లీ ఫోన్ చేస్తామని చెప్పేవారని ఆయన అన్నారు. అంటే మళ్లీ తాను 4.30కి అక్కడి నుంచి బయలుదేరేవాణ్ణన్ని ఆయన చెప్పారు. అప్పటికీ అన్ని సీట్లు ఫిల్ అయ్యేవని, జనరల్ కంపార్ట్‌మెంట్లలో ఖాళీగా ఉంటుందేమో అని అక్కడికి వెళ్లితే, అక్కడ కూడా చాలా మంది ఉండేవారని ఆయన అన్నారు. అక్కడ కూడా స్థలం లేకపోవడంతో బాత్‌రూం దగ్గరికెళ్లి కూర్చునే వాడినని ఆయన వివరించారు. కొన్ని సార్లు నిద్ర వచ్చి, అక్కడే పడుకునే వాడినని, అక్కడున్న సింక్ నుంచి వాటర్ లీక్ అవుతూ, ఆ వాసనలోనే ఉండేవాడినని రాజీవ్ తెలిపారు.