శేఖర్ మాస్టర్‌కు అమ్మాయిల పిచ్చి ఉందా?.. హైపర్ ఆది కామెంట్స్ వైరల్

Hyper Aadi Humiliates Sekhar Master In Jabardasth

బుల్లితెరపై వచ్చే ఎంటర్టైన్మెంట్ షోల్లో ఈ మధ్య డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువైపోతున్నాయని తెగ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందులోనూ ఒకరికి మించి మరొకరు రెచ్చి పోయి మరీ సెటైర్స్, కౌంటర్స్ వేస్తుంటారు. ఇలా నిత్యం ఎవరినో ఒకర్ని టార్గెట్ చేస్తూనే ఉంటారు. అలా టార్గెట్ అయ్యి అయ్యి సుడిగాలి సుధీర్ మీద మోస్ట్ రొమాంటిక్ అని అమ్మాయిలంటే పిచ్చి అనే ముద్ర వేసేశారు. యాంకర్ రవి, శేఖర్ మాస్టర్ వంటి వారిపైనా ఇలాంటి సెటైర్సే వేస్తుంటారు.

తాజాగా జబర్దస్త్ షోకు సంబంధించిన ప్రోమో తెగ వైరల్ అవుతోంది. అందులో హైపర్ ఆది శేఖర్ మాస్టర్‌ను ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. వరుసగా పంచ్‌లు, కౌంటర్లు వేస్తూనే వచ్చాడు. ఒకానొక దశలో వాటిని వింటే అవి నిజమేమోననే సందేహం కలుగుతుంది. శేఖర్ మాస్టర్‌ నిజంగా అలాంటి వాడేనా? అమ్మాయిల పిచ్చి ఉందా? అనే అనుకునేంతగా శేఖర్ మాస్టర్‌పై కౌంటర్లు వేస్తూనే ఉన్నాడు. ఇంతకీ హైపర్ ఆది ఏమన్నాడో ఓ సారి చూద్దాం.

హైపర్ ఆది తన స్కిట్స్‌లో భాగంగా కొత్త కొత్త అమ్మాయిలను తీసుకొచ్చే అలవాటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో కొత్త అమ్మాయిను పరిచయం చేశాడు. స్కిట్‌లో భాగంగా ఆమె ఎంట్రీ ఇచ్చి.. ‘ఏమండీ.. ఆ ఇద్దర్నీ (మను, శేఖర్ మాస్టర్) చూశారా?? ఆయన దగ్గర ఆట ఉంది.. ఈయన దగ్గర పాట ఉంది’ ఓ సెటైర్ వేస్తుంది. ఇక వెంటనే హైపర్ ఆది అందుకుని.. ‘ఏమే.. మొగుడు మల్లెపూలు చేతికి చుట్టుకుని రెడీగా ఉంటే.. ఆయన దగ్గర ఆట ఉంది.. ఈయన దగ్గర పాట ఉంది అంటావా?? మరి నా దగ్గర ఏం లేదనా??’ అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ కొట్టాడు.

‘పరాయి పురుషుడ్ని చూస్తే మీకు జెలాసీ’ అని మళ్లీ ఆ అమ్మాయి అనడంతో.. ‘పర పురుషుడు అయితే ఓకేనే.. అక్కడ ఉన్నది శేఖర్ మాస్టర్.. పురుషులందు ఆ పురుషుడు వేరయా.. విశ్వదాభి రామా ఆయన కన్ను పడిందంటే నువ్ సేఫ్ కాదే భామా??’ అంటూ మరో కౌంటర్ వేశాడు. ‘ఈ అందం అంతా అడవి కాచిన వెన్నెల కావాల్సిందేనా’ అని అంటూ ఆ మహిళ మరో డైలాగ్ చెప్పడంతో ‘నువ్ అలాంటి హింట్లు ఇవ్వకు.. అక్కడ ఆయన కాచుకుని కూర్చున్నాడు’ అంటూ శేఖర్ మాస్టర్‌ని ఓ ఆట ఆడుకున్నాడు హైపర్ ఆది. అయితే ఇవన్నీ స్కిట్ కోసమే అయినా.. పదే పదే అవే కౌంటర్లు, అవే సెటైర్లు శేఖర్ మాస్టర్ మీద ప్రయోగింస్తుండటంతో అదే ఇమేజ్ ఏర్పడే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.