కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో విధించిన లాక్ డౌన్ లో ఎంతో మంది ఆకలితో అలమటించారు. అలాంటి సమయంలో విశేషమైన సేవలందించిన నటుడు సోనూ సూద్ కు అరుదైన గుర్తింపు లభించింది. 2020లో ప్రపంచంలో టాప్ 50 ఆసియన్ సెలబ్రిటీల’ జాబితాలో సోనూసూద్ ఏకంగా మొదటి స్థానం దక్కించుకున్నారు. ఇలాంటి జాబితాను విడుదల చేయడం ఇదే ప్రథమం.
యూకేలోని ఈస్టర్న్ ఐ అనే వార పత్రిక దీన్ని ప్రచురించింది. ఈ పత్రిక ఎంటర్‌టైన్ మెంట్ ఎడిటర్ అస్‌జాద్ నాజిర్ ఈ జాబితా రూపొందించారు. ఇందులో మొదటి స్థానంలో సోనూ సూద్, రెండో స్థానంలో కెనడా సోషల్ మీడియా స్టార్ లిల్లీ సింగ్‌లో నిలిచారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు 7వ స్థానం దక్కింది.
లాక్ డౌన్ సమయంలో ఆయన ప్రదర్శించిన దాతృత్వం దేశ విదేశాల్లో ప్రశంసలు అందుకుంది. తాము ఇబ్బందుల్లో ఉన్నాం, ఆదుకోండి అని కోరుతూ ఇప్పటికీ సోనూ సూద్‌కు పెద్ద సంఖ్యలో లేఖలు వస్తున్నాయట. అందుకే రూ.10 కోట్లు సమీకరించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ముంబైలోని 8 ఆస్తులను తాకట్టు పెట్టినట్లు తెలిసింది. ఇందులో 2 దుకాణాలు, 6 ఫ్లాట్లు ఉన్నాయి.