అనుష్క .. తెలుగు సినీ అభిమానులకి జేజమ్మ , దేవసేన. సూపర్ సినిమాతో పరిచయమై అనతి కాలం లోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్ హోదా సంపాదించింది. మొదట్లో కాస్త గ్లామర్ ఎక్కువ ఉన్న రోల్స్ చేసినా ఆ తర్వాత ఆమెకు కథా ప్రధాన్యమున్న సినిమాలు వచ్చాయి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమా అనుష్క సినీ కెరీర్‌ను పూర్తిగా మలుపుతిప్పింది.
ఈ సినిమాతో ఆమె ఇమేజ్ పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. ఈ సినిమాతోనే ఈమెకు హీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇక బాహుబలిలో దేవసేన పాత్ర.. ఆమెకు మరో మైలురాయిగా చెప్పోచ్చు.
ఇక అది అలా ఉంటే.. అనుష్క పోలవరం ప్రాజెక్టు సమీపంలో గోదావరి నది మధ్యలో ఉన్న మహానందీశ్వరస్వామి ఆలయాన్నిదర్శించుకున్నారు. నిన్న బుధవారం దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనుష్క తన స్వస్థలం మంగుళూర్ నుంచి సహచర బృందంతో తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం చేరుకుని అక్కడి నుంచి మరబోటుపై ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్తీక మాసంలో గోదావరి మధ్యలోని ఈ ఆలయాన్ని దర్శించుకోవడం మనసుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. షూటింగుల కారణంగా గుడికి వెళ్లడం దర్శించుకోవడం వీలు పడకపోవడం వల్ల ఈ కార్తీక మాసంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు చెప్పారు