సీనియ‌ర్ డైరెక్ట‌ర్ తో హాట్ హీరోయిన్ ఎఫైర్ క‌హానీ

ఫలానా ద‌ర్శ‌కుడితో ఫలానా క‌థానాయిక ఎఫైర్ అంటూ ప్రేమ‌క‌థలెన్నో వింటూనే ఉంటాం. కానీ టాలీవుడ్ లో ఇలాంటివి వినేది త‌క్కువే. ఫ‌లానా పెళ్లికాని హీరోయిన్ తో వివాహితుడైన‌ దర్శకుడి శృంగార క‌లాపం!! అంటూ కొన్ని గుస‌గుస‌లు ఇటీవ‌ల వినిపిస్తున్నాయి. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహ‌ బంధం తొలి నుండి చాలా వివాదాల‌కు కార‌ణ‌మైంది. ఫ్యామిలీ లైఫ్ స్ట్ర‌గుల్స్ కి దారి తీసింది. ఏదేమైనా, వీరిద్దరూ కలిసి నివసిస్తున్నారు అనేది తాజా గుస‌గుస‌. ప్రతిదీ కలిసి చేస్తారు. కానీ ఇప్పటికీ ఆ జంట‌ దేనినీ అంగీకరించరు.

కెరీర్ ప‌రంగా ఆ ఇద్ద‌రూ పూర్తిగా సింక్ అయ్యారు. స్నేహం కెరీర్ కి అనూహ్యంగా క‌లిసొస్తోంది. కెరీర్ లో పూర్తిగా దెబ్బతిన్న తరువాత ఆ జంట నిర్మాత‌లుగా మారి అదిరిపోయే బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి ఇప్పుడు ముంబై పరిచయాలను ఉపయోగించుకుని ఎదిగే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే ఈ జ‌ర్నీలోనూ ఊహించ‌ని మ‌లుపు ఎదురైంది. అనూహ్యంగా ముంబైలో క‌రోనా విల‌యం షూటింగుకి దెబ్బేసింది. దీంతో అక్క‌డే ఆ ఇద్ద‌రూ లాకైపోవ‌డంతో ర‌క‌ర‌కాల అనుమానాలు మొద‌ల‌య్యాయి. అయితే  ఇటీవ‌లే తిరిగి హైదరాబాద్ వచ్చారు. కొంతకాలంగా ఎవ‌రి ఇళ్ల‌లో వారు ఉన్నారు. కానీ ఇప్పుడు దేశీయ విమానాల ప్రయాణ నిషేధాన్ని ఎత్తివేయ‌డంతో ఆ ఇద్ద‌రూ మళ్లీ హైదరాబాద్ నుండి ముంబైకి వెళ్లార‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం ముంబైలో దిగిపోయిన ఈ ల‌వ్ క‌పుల్ ఖాళీ సమయాన్ని ఓ రేంజులోనే ఆస్వాధిస్తున్నారు. వేకువ‌ఝామునే వ్యాయామం చేయ‌డం దినచర్య. దాని కోసం ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు వారేంటో అర్థ‌మైపోతోంది. ముంబైలో వారికి తీరిక స‌మ‌యం ఆట‌విడుపుగా మారింద‌ని చూప‌రులు గుస‌గుస‌లాడుతున్నారు. వివాహితునితో అవివాహిత‌ అందమైన ప్రేమకథను కొనసాగిస్తున్నారు అంటూ గుస‌గుస‌గా మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఇది ఎఫైర్ అంటే ఆ ఇద్ద‌రూ ఒప్పుకోరు. కేవ‌లం స్నేహం మాత్ర‌మేన‌ని చెబుతారు. కాని చూసేవాళ్లు మాత్రం అది నిజ‌మేన‌ని న‌మ్మ‌రు. ఎందుక‌లా అంటే అదంతే!!