రాజమౌళిని కలవడంపై “అవెంజర్స్” దర్శకులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

ఇప్పుడు కేవలం ఒక్క తెలుగు సినిమానే కాకుండా ఇండియన్ సినిమాని కూడా ప్రపంచ స్థాయిలో మరో లెవెల్లో నిలబెట్టిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి హవా నడుస్తుంది. దీనితో జక్కన్న పేరు ప్రపంచ వ్యాప్తంగా కూడా వినిపిస్తుంది.

లేటెస్ట్ గా ట్రిపుల్ ఆర్(RRR) సినిమాతో ఏకంగా హాలీవుడ్ స్టార్స్ కూడా రాజమౌళి మాస్టర్ వర్క్ కోసం మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక రీసెంట్ గా అయితే వరల్డ్ బాక్సాఫీస్ హిట్ చిత్రం “అవెంజర్స్” సిరీస్ దర్శకులు రూసో బ్రదర్స్ రాజమౌళిపై కొన్ని కామెంట్స్ చేశారు.

తాము రాజమౌళితో కలిసి ఓ సినిమా చెయ్యాలి అనుకుంటున్నామని తెలిపారు. అయితే రాజమౌళిని కలవడంపై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వాలారు లేటెస్ట్ గా చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి రాజమౌళిని తాము కలవడం ఎంతో గౌరవప్రదంగా ఫీల్ అవుతున్నామని అంతేకాకుండా ది గ్రేట్ రాజమౌళి అంటూ వారు సంబోధించారు.

దీనితో ఇండియన్ సినిమా లవర్స్ మరింత గౌరవం వ్యక్తం చేస్తున్నారు. మరి రూసో బ్రదర్స్ నుంచి వచ్చిన లేటెస్ట్ భారీ ఏక్షన్ థ్రిల్లర్ చిత్రం “ది గ్రే మ్యాన్” ఓటిటి లో రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇండియాకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారు మరిన్ని ఆసక్తికర కామెంట్స్ చేసారు.