రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం నేక్ డ్. టైటిల్ కి తగ్గట్టే నగ్నదృశ్యాలు శృంగారాన్ని ప్రేరేపించడం వంటి ఎన్నో జిమ్మిక్కులతో ఈ సినిమా ఆద్యంతం యువతరాన్ని ఆకట్టుకుంటోందని సమాచారం. ఇటీవలే రిలీజైన ఈ సినిమాకి రూ.200 టిక్కెట్టు ధరతో ఏకంగా 35 వేల టిక్కెట్లు విక్రయించారని తెలుస్తోంది. ఇది వెబ్ లో రిలీజైన సినిమా.
ఇక ఈ మూవీలో పశ్చిమ గోదావరికి చెందిన తెలుగమ్మాయి శ్రీ రాపాక ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ అమ్మడు అందాల ఆరబోతకు అడ్డు చెప్పక ఆన్ స్క్రీన్ ఓ రేంజులో చెలరేగిపోవడంతో మేకర్స్ కి కాసులు కురుస్తున్నాయట. ఆసక్తికరంగా ఇది వెబ్ సినిమానే కాబట్టి కేవలం ఆరు లక్షల బడ్జెట్ తో తెరకెక్కించి అంతే బడ్జెట్ ని ప్రాచారానికి ఖర్చు చేశారట ఆర్జీవీ. ఇక కథానాయికగా నటించిన శ్రీకి కేవలం రెండు లక్షల పారితోషికం ఇచ్చారట. తాను కూడా అంతే డిమాండ్ చేసిందని తెలిసింది.
ఇక నేక్డ్ మూవీలో చిట్టి పొట్టి దుస్తుల్లో శ్రీ రాపాక ట్రీట్ మతి చెడగొట్టింది. ఇక చీరలో అందాల ఆరబోత బిగువులతో మైమరిపించిన తీరు టీనేజర్స్ కంటికి కునుకు కరువయ్యేలా చేస్తోందట. దీంతో ఆన్ లైన్ లో టికెటింగ్ కి డిమాండ్ ఊపందుకుందట. మొత్తానికి ఆర్జీవీ శృంగార సినిమాలతో సరికొత్త రికార్డులు బ్రేక్ చేస్తున్నాడన్నమాట. జీఎస్.టీ ఆ తర్వాత బ్యూటిఫుల్.. మియా మల్కోవా సినిమా ఇవన్నీ ఈ కేటగిరీనే. తాజాగా నేక్ డ్ అంతకుమించి వేడెక్కించేయడం హాట్ టాపిక్ గా మారింది.