హీరోయిన్లంద‌రి చెంప చెళ్లు మ‌నిపించిన ప్ర‌ణీత‌

టాలీవుడ్ పేరు చెప్పి కోట్ల రూపాయ‌లు సంపాదించిన హీరోయిన్లు ఉన్నారు. ఒక్క సినిమాకు సంత‌కం చేస్తే కోటి రూపాయ‌లు ముక్కు పిండి మ‌రీ వ‌సూల్ చేస్తున్నారు. సినిమా హిట్ అయిందంటే హిట్ ..హిట్ కి పారితోషికం పెంచుకుంటూనే పోతారు. కానీ ఎవ‌రైనా క‌ష్టాల్లో ఉన్నారంటే? మాత్రం రూపాయి సాయం చేయ‌డానికి ఏ స్టార్ హీరోయిన్ కి చేయి రాద‌ని తేలిపోయింది. లాక్ డౌన్ తో పేద‌లు క‌ష్టాలు వ‌ర్ణనాతీతంగా మారిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ నుంచి కొంత మంది స్టార్ హీరోలు స్పందించి విరాళాలు అందించ‌డంతో సినీ కార్మికుల‌కు నెల రోజుల‌కు స‌రిప‌డ్డ నిత్యావ‌స‌ర స‌రుకులు అందించారు.

మే 3 త‌ర్వాత లాక్ డౌన్ పొడిగిస్తే ప‌రిస్థితి ఏంట‌న్న‌ది? ఆ దేవుడే దిగి వ‌చ్చి క‌ష్టాలు తీర్చాలేమో! అన్న‌ట్లు ప‌రిస్థితి మారిపోతుంది. తెలుగు రాష్ర్టాల ప్ర‌జ‌లు..దిన‌స‌రి కూలీలు..నిరు పేద‌లు ఇన్ని అవ‌స్థ‌లు ప‌డుతున్నా తెలుగు ప్ర‌జ‌ల‌ను అడ్డం పెట్టుకుని సంపాదించిన ఒక్క స్టార్ హీరోయిన్ కూడా రూపాయి విరాళంగా ఇవ్వ‌క‌పోవ‌డం నిజంగా శోచ‌నీయం. క‌నీసం వాళ్ల‌ సొంత రాష్ర్టాల్లో కూడా స‌హాయం చేయ‌క‌పోవ‌డంపై సోష‌ల్ మీడియాలో స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లు వెత్తుతున్నాయి. ఈ వేడిలో తాజాగా న‌టి ప్ర‌ణీత భోజ‌నం త‌యారు చేసి ప్యాకెట్ల‌లో స‌ర్ది పేద‌ల‌కు పంపిణీ చేసి హీరోయిన్ల ప‌రువు కాపాడింది. తానే స్వ‌యంగా రంగంలోకి దిగి వంట చేయ‌డం, వండిన ప‌దార్థాల‌ను ప్యాక్ చేసి పేద‌ల‌కు అందించ‌డం విశేషం.

అంత‌కు ముందు ప్ర‌ణీత కొంత ఆర్ధిక సహాయం కూడా చేయ‌డం విశేషం. ప్ర‌ణీత‌ను క్లోజ్ గా చూసిన వాళ్లంతా ఆమెను చూసి మిగ‌తా హీరోయిన్లంతా బుద్ది తెచ్చుకోవాల‌ని? ఇప్ప‌టికైనా మాన‌వ‌త్వంతో వ్య‌వ‌రించాల‌ని మండిప‌డితున్నారు. ఇంట్లో కూర్చొని ఛాలెంజ్ లు చేయ‌డం కాదు..స‌హాయం ఎలా చేయాల‌ని ఛాలెంజ్ లు విస‌రండి. ఎంత మంది స్వీక‌రిస్తారో చూద్దాం. అతేగానీ యోగాలు..జిమ్ము..ఫోటోషూట్లు అంటూ కాల‌క్షేపం చేయ‌కండి..ఆ స‌మ‌యంలో స‌మాజానికి ఉప‌యో ప‌డే ప‌నులేవైనా చేయండంటూ విమ‌ర్శిస్తున్నారు.