ప్రియురాలి సోదరుడితో సీక్రెట్ బిజినెస్!?
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆకస్మిక మరణం పలు సందేహాలకు తావిచ్చింది. అతడు ఉరి వేసుకున్న ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్టు లేఖ లభించకపోవడంతో పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని డిప్రెషన్ మందులు ఇందుకు పురి కొల్పాయని పోస్ట్ మార్టమ్ రిపోర్టులో వెల్లడించినా.. అంతకుమించి ఇంకేదైనా తెరవెనక కారణాలున్నాయా? అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సుశాంత్ సింగ్ మరణంపై అభిమానులు.. కుటుంబీకులు పలు అనుమానాల్ని వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. ఇప్పటికీ నెటిజనులు సోషల్ మీడియాల్లో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు మాత్రం ఇది ఆత్మహత్యనే అంటున్నారు.
“ఉరి వేసుకోవడం వల్ల ఉక్కిరిబిక్కిరి అయ్యి మరణించాడు. అస్ఫిక్సియా సాధారణీకరించిన హైపోక్సియాకు కారణమవుతుంది. ఇది ప్రధానంగా కణజాలం సహా అవయవాలను ప్రభావితం చేస్తుంది. అతని వివరణాత్మక పోస్ట్-మార్టం నివేదిక మాకు లభించింది. సుశాంత్ మరణానికి కారణం ఉరి వేసుకోవడమే. వైద్యులు అస్ఫిక్సియాను స్పష్టంగా పేర్కొన్నారు“ అని ముంబై కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) అభిషేక్ వెల్లడించారు. ఉరి వేసుకోవడం వల్లనే అస్ఫిక్సియా అనేది వైద్యుల వెర్షన్ అని స్పష్టంగా పేర్కొన్నారు.
అయితే అతను ఉరి వేసుకున్నాడా లేదా మరొకరు ఊపిరి తీశారా? అన్నది వైద్యులు స్పష్టం చేయలేదు. పోలీసు & వైద్య బృందాల నుండి దర్యాప్తు సరిగా లేదని ఈ రిపోర్టును అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగానే 27 మంది నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీస్ ఇప్పటికీ విచారణ సాగిస్తూనే ఉన్నారు. తాజాగా సుశాంత్ సింగ్ గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తి సోదరుడు సయీక్ చక్రవర్తి వాంగ్మూలం తీసుకుంటున్నారు. రియా సోదరుడితో కలిసి సుశాంత్ సింగ్ ఇంతకుముందు కృత్రిమ మేథస్సు సంస్థ ఒకటి రన్ చేశారు. ఇందులో ఆ ఇరువురు భాగస్వాములుగా ఉండగా.. దీనిని గత ఏడాది రియా చక్రవర్తి స్వయంగా ప్రారంభించింది.
Bandra police has recorded statements of 27 people so far in the #SushantSinghRajput's death case. We've got his detailed post-mortem report & doctors have clearly mentioned asphyxia due to hanging as cause of his death: Abhishek Trimukhe, Dy Commissioner of Police (DCP). #Mumbai pic.twitter.com/GlkoN0b91j
— ANI (@ANI) June 27, 2020
అయితే సుశాంత్ ఆత్మహత్య అనంతరం ఈ సంస్థ గురించిన ఏ వివరం బయటకు రాలేదు. ఇదంతా హైడ్ చేసి ఉందని తెలుస్తోంది. అయితే పోలీస్ విచారణలో ఇంకేదైనా ట్విస్ట్ ఉంటుందా? అంటూ సస్పెన్స్ నెలకొంది. భాగస్వామ్య సంస్థ ఆర్థిక కార్యకలాపాలు అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు సాగించేవీలుందని భావిస్తున్నారు. అయితే రియా సోదరుడు దోషినా లేక నిర్ధోషినా అన్నది ఇంకా నిర్ధారణకు రాకూడదు. దీనిపై విచారించి పోలీసులే దర్యాప్తులో నిజానిజాల్ని చెప్పాల్సి ఉంటుంది.
Asphyxia or asphyxiation is a condition of deficient supply of oxygen to the body that arises from abnormal breathing. An example of asphyxia is choking. Asphyxia causes generalized hypoxia, which affects primarily the tissues and organs.
— Dr. Vedang Tripathi (@Beingvedang961) June 27, 2020