హీరో సూర్య ఏమి చేశాడో తెలుసా, టాలివుడ్ లో ఇలా జరిగేదా?

రైతుల సమస్యల మీద తెలుగోళ్లు లెక్కలేనన్ని సినిమాలు తీశారు. అంతేకాదు, మల్టీనేషనల్ కంపెనీల వల్ల భూములు కోల్పోతున్న రైతులమీద సినిమా తీశారు. రైతుల కష్టాల మీద సినిమాలు తీసి బాగా వ్యాపారం చేసుకోవడం ఈ మధ్య ఫ్యాషన్ అయింది.అంతే, ఆ కథ హీరో ఇంటికో, నిర్మాత ఇంటికో డబ్బు సంచులు మోసుకుపోతుంది. రైతులు సినిమాలకు కథలై  పడివుంటారు దీనంగా.

 

ఇది టాలివుడ్ పరిస్థితి.

 

తమిళనాడులో పరిస్థితి ఇలా ఉండదు. అక్కడ హీరోలు మనసా వాచా రైతుల మీద సింపధీతో ఉంటారు. రైతుల కోసం ఢిల్లీ వెళ్లి ప్రధాని ని కలుసుకుంటారు. తమిళనాడు రైతుల సమస్య పరిష్కరించాలని ధర్నాలు చేస్తారు. ఇందులో నటనేమీ ఉండదు. నిలువెల్ల నిజాయితీ కనిపిస్తుంది. దీన్ని సొమ్ముచేసుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్న దాఖలాలు లేవు అలాంటి రిపోర్టులు లేవు. దీనికి సాక్ష్యం ఈ రోజు హీరో సూర్య చేసిన ఒక మాంచి పని.

 

ఈ రోజు చెన్నైలో  ఆయన రైతుల సంక్షేమం కోసం, రైతాంగ సమస్యల మీద అధ్యయనం చేసేందుకు కోటి రుపాయల విరాళం ప్రకటించారు.

సూర్య మీకు తెలుసుగా,  రైతు సమస్యల నేపథ్యంలో చినబాబు సినిమాను నిర్మించిన కోలీవుడ్ స్టార్‌హీరో. తమిళంలో కడైకుట్టి సింగమ్ గా వచ్చి సూపర్ హిట్టయింది. ఇంకా కుటుంబాలు కుటుంబాలు సినిమా చూసేందుకుపరుగులు తీస్తున్నాయి. ధియోటర్లన్నీ హౌస్ ఫుల్లే. ఈ నేపథ్యంలో  చెన్నైలో మూవీ సక్సెస్ మీట్ జరిగింది. సంబరం చేసుకునేందుకు కాదు, సంబరం పంచుకునేందుకు. Real joy lies in sharing the success with others.

సూర్య ఈపని ఎలా చేశాడో తెలుసా? తానే స్వయంగా ఆరుగురు రైతులకు 12 లక్షల రూపాయలు అందజేశాడు తర్వాత రైతుల సంక్షేమం కోసం, ఈ అంశం మీద మరింత ఆధ్యయనం చేసేందుకు  వ్యవసాయాభివృద్ధి సంస్థకు ఒక కోటి (అక్షరాల ఒక కోటి) విరాళం ప్రకటించారు.

తమిళ నాట కడై కుట్టి సింగమ్ (చినబాబు) సినిమా ఘనవిజయం సాదించింది. ఆ చిత్రాన్ని తమిళ ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు.  సినిమాకు బాగా లాభాలొచ్చాయి. 2D ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ కింద కార్తీ, సయోషా కాంబినేషన్ లో  సూర్య ఈచిత్రాన్ని స్వయంగా నిర్మించారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రీలీజ్ అయిందీ చిత్రం. తెలుగునాట ఏమంత పోక పోయినా, తమిళనాట మాత్రం విజయ ఢంకా మోగించింది. వ్యవసాయం, కుటుంబం చుట్టు తిరిగే ఈ కథ తమిళ ప్రజలకు చాలా బాగా నచ్చింది.  తనకు లాభాలిచ్చిన రైతుల,వ్యవసాయం రుణం తీర్చుకోవాలని ఆయన భావించారు. అంతే, ఈ విరాళం ప్రటకించారు.

 

సూర్య ,కార్తీ విరాళాలు ఇవ్వడం మొదటి సారి కాదు, ఆ మధ్య సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛేంబర్ ఆఫ్ కామర్స్  వారి ఒక ప్రీవ్యూ ధియేటర్ కు తమ తల్లి తండ్రుల పేరు పెట్టమని ఒక కోటి విరాళమిచ్చారు.