కరోనా లాక్ డౌన్ బ్రేక్ లో పెళ్లాడేసి తెలివైన పని చేశాడు నిఖిల్. తాను ప్రేమించిన డాక్టర్ పల్లవి వర్మను పెళ్లాడి సంసారంలో సరిగమల్ని ఆస్వాధించేస్తున్నాడు. నిఖిల్ స్ఫూర్తితో ఇప్పుడు ఇతర హీరోలు త్వరగా పెళ్లాడే ఆలోచనలోనే ఉన్నారు. అదంతా సరే కానీ ఈ కొద్దిపాటి గ్యాప్ లో నిఖిల్ తాను నటించే తదుపరి సినిమాల స్క్రిప్టులపైనా సీరియస్ గానే దృష్టి సారించాడు. పెళ్లాడినా కానీ కెరీర్ సంగతుల్ని మాత్రం అతడు పక్కన పెట్టేయలేదు. కార్తికేయ 2 అలానేన 18 పేజెస్ రెండు సినిమాల్ని వేగంగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడట.
పనిలో పనిగా అతడు సరికొత్త కాన్సెప్టుతో మరోసారి అభిమానులకు టచ్ లోకి వచ్చాడు. ఈసారి కాన్సెప్ట్ ఇ-సైకిల్స్ ప్రమోషన్. ముందుగా తాను ఒక ఎలక్ట్రిక్ సైకిల్ కొనుక్కున్నాడు. 30 కి.మీ ల వేగంతో వెళ్లే ఈ సైకిల్ ఒకసారి ఛార్జ్ చేస్తే 80 కి.మీల వరకూ ఆగకుండా వెళుతుందట. దీనితో పెట్రోల్ ఖర్చు బాధ ఉండదని చెబుతున్నాడు. అలాగే వాతావరణ కాలుష్యం ఉండదు అంటూ.. మొత్తానికి సరికొత్త ప్రచారంతో దూసుకొచ్చాడు.
మునుముందు పొల్యూషన్ ఫ్రీ కాన్సెప్టుకి తగ్గట్టే మనోడు తెలివైన ప్రకటనలతోనే దూసుకొచ్చాడు. ఇంతకీ ఇ-సైకిల్ బ్రాండింగ్ కాంట్రాక్ట్ తో అతడు ఏమేరకు ఆర్జిస్తున్నాడో తెలియాల్సి ఉంది. అయినా దీపం ఉండగానే చక్కదిద్దుకోవడం నిఖిల్ కి తెలిసినంతగా వేరే ఎవరికీ తెలీదేమో!