ఇప్పుడిప్పుడే మన తెలుగు సినిమా హీరోలు మరింత స్థాయిలో అయితే మంచి మార్కెట్ ని సంపాదించుకుంటున్నారు. మంచి కంటెంట్ తో వెళితే అందరూ కాకపోయినా కొందరు మాత్రం నార్త్ మార్కెట్ లో హిట్ అవుతున్నారు. మరి అలాంటి హీరోస్ లో అయితే యంగ్ హీరో నిఖిల్ తన ఫస్ట్ అటెంప్ట్ “కార్తికేయ 2” తోనే పాన్ ఇండియా మార్కెట్ లో సత్తా చాటాడు.
ఇక ఈ చిత్రం తర్వాత పాన్ ఇండియా మార్కెట్ లో ఆచి తూచి సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ ఓవర్ మిస్టేక్స్ చేస్తే అది మొదటికే మోసం తీసుకొస్తుంది అని చెప్పాలి. తాను పాన్ ఇండియా రిలీజ్ గా రిలీజ్ అవుతున్న మరో సినిమానే “స్పై”. దర్శకుడు గ్యారీ బి హెచ్ తెరకెక్కించిన ఈ చిత్రం సుభాష్ చంద్రబోస్ కాన్సెప్ట్ తో అయితే రాబోతుంది.
కానీ ఈ సినిమాకి లాస్ట్ మినిట్ చేసి అంతా హదువుడి మాత్రమే కనిపిస్తుంది. నిర్మాతలు ఒక మాట మీద హీరో ఒక మాట మీద ఉండే సరికి సినిమా ఫలితం దెబ్బ పడే అవకాశం ఉందని సినీ వర్గాలు చెప్తున్నాయి. సినిమాకి ఇంకా పలు పనులు బ్యాలన్స్ ఉండగా నిర్మాతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జూన్ 29 రిలీజ్ ని ఫిక్స్ అయ్యి ఉన్నారు. ఇక హీరో కూడా చేసేది ఏమి లేక ఆ డేట్ కి ఫిక్స్ అయ్యారు.
అయితే నిజానికి ఈ డేట్ ముందే అనౌన్స్ చేసినప్పటికీ మధ్యలో ప్రమోషన్స్ ఆపేసారు ఆపేసి మళ్ళీ అదే డేట్ అంటూ వస్తున్నారు. ఇక ఈరోజు రావాల్సిన ట్రైలర్ కూడా సాయంత్రానికి వాయిదా పడింది. దీనితో ఇన్ని హర్డల్స్ పెట్టుకొని నిఖిల్ తన కెరీర్ విషయంలో తప్పక తప్పు చేస్తున్నాడా అనిపిస్తుంది. మరి రీసెంట్ గా ఇదే తరహాలో కంగారు రిలీజ్ కి వచ్చేసిన చిత్రం “ఏజెంట్” కి ఎలాంటి ఫలితం దక్కిందో తెలిసిందే. మరి ఈ సినిమాకి ఏమవుతుందో చూడాలి.