మంచుమోహన్ బాబు సినీఫీల్డ్ లోనే కాదు, నిజజీవితంలో కూడా ఆఫ్ బీట్ మనిషి. ఆయన మాట తీరు, అభిమానం, ఆతిథ్యం అన్నీకూడా ఆఫ్ బీట్ కూడా ఉంటాయి.మితం అనేది ఆయనకు తెలియదు. కోపం, స్నేహం అన్ని అమితమే. ఆయన ఇపుడు మరొక ఆఫ్ బీట్ కోరిక బయటపెట్టారు. ఆయన తమిళనాడుముఖ్యమంత్రిగా కరుణానిధి కుమారుడు స్టాలిన్ ని చూద్దామనుకుంటున్నారు. ఆయన ఇంతవరకు ఆంధ్రలో ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారో చెప్పలేదు. ఏ పార్టీని ఆయన సపోర్టు చేస్తారో చెప్పలేదు. అయితే, తమిళనాడు లో మాత్రం డిఎంకె నేత స్టాలిన్ ను ముఖ్యమంత్రి చూడాలనుకుంటున్నారు. ఈ విషయం మీద ఇలా ట్వీట్ చేశారు.
Thank q my brother @mkstalin for inviting me for the condolence meeting in Coimbatore for your great legendary father. I wish you all the best and hope to see you as the Chief Minister. pic.twitter.com/n0ZmSXdDih
— Mohan Babu M (@themohanbabu) August 26, 2018