చిరంజీవితో అనుష్క.! నిజమేనా.? వండి వడ్డించారా.?

అప్పుడెప్పుడో చాలాకాలం క్రితం గాసిప్ అది.! దాన్నే మళ్ళీ ఇంకోసారి బలవంతంగా రుద్దుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సరసన అనుష్క హీరోయిన్‌గా నటించబోతోందిట. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సన్నబడేందుకు ప్రయత్నిస్తున్నారట.

ఇంతకీ, విషయమేంటి.? అని ఆరా తీస్తే, అనుష్క ఇప్పట్లో ఏ కొత్త సినిమాకీ తెలుగులో కమిట్ కాలేదు. హీరోయిన్ గురించి చిరంజీవి కూడా ఆలోచించడంలేదు. ప్రస్తుతం పూర్తిగా చిరంజీవి రెస్ట్ తీసుకుంటున్నారు. అదే సమయంలో యంగ్ డైరెక్టర్స్ చెబుతున్న కథలూ వింటున్నారు.

జిమ్‌లో కొంచెం బాగానే కష్టపడుతున్నారట. వైద్యుల పర్యవేక్షణలో కొంత వర్కవుట్స్ కూడా గట్టిగానే చేస్తున్నారన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం. డాన్సులు చిరంజీవి బలం. ఈసారి ఆ డాన్సుల్లో ఇంకాస్త వేగం చూపించాలని చిరంజీవి అనుకుంటున్నారట.

ఇదీ మేటర్.! ఇంతకు మించి కొత్తగా చిరంజీవి హీరోయిన్ల గురించి అస్సలు ఆలోచించడంలేదు. వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయాలి. దానికి సంబంధించి థీమ్ లుక్ ఇటీవల విడుదలైంది కూడా.

ఇంకోపక్క, కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలోనూ చిరంజీవి ఓ సినిమా చేయనున్నారు. అయితే, వశిష్ట సినిమా పూర్తయ్యేదాకా కళ్యాణ్ కృష్ణ సినిమా గురించి చిరంజీవి ఆలోచించకపోవచ్చు. మధ్యలో ఇంకో కథ కూడా ఒకే అయ్యేలా వుందిట.