ఇన్సైడ్ టాక్ : మెగాస్టార్ కోసం ఈ బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్?

తెలుగు సినిమా దిగ్గజ హీరోస్ లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన రీసెంట్ సినిమా భోళా శంకర్ భారీ డిజాస్టర్ అయ్యిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం తర్వాత అయితే మెగాస్టార్ రెండు భారీ సినిమాలు అది కూడా స్ట్రైట్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

కాగా ఈ చిత్రాల్లో అయితే ఓ సినిమా కోసం మన టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ లాక్ అయ్యినట్టుగా సినీ వర్గాల నుంచి రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే అమేథీ మెగాస్టార్ ఇంతకు ముందు హీరో హీరోయిన్స్ గా జత కట్టింది లేదట.

మరి ఆమె ఎవరో కూడా టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి అట. మరి ఈమె ఇది వరకు అయితే మెగాస్టార్ తో హీరోయిన్ గా నటించింది లేదు. ఆమె స్టాలిన్ చిత్రంలో కేవలం ఓ సాంగ్ లో అయితే మెగాస్టార్ సరసన డాన్స్ చేసింది అంతే. ఇప్పుడు ఫైనల్ గా హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది అని అంటున్నారు.

మరి చిరు 156వ సినిమాలోనా లేక 157వ సినిమా లోనా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ మొత్తానికి ఈ ఎగ్జైటింగ్ కాంబినేషన్ పై ఈ న్యూస్ మాత్రం మెగా ఫ్యాన్స్ లో ఆసక్తి రేపింది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడు పడుతుందో చూడాలి. కాగా రీసెంట్ గానే అనుష్క నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాపై మెగాస్టార్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.