Home Tollywood హీరో గోపీచంద్ న‌ట‌వార‌సులు హ‌ల్చ‌ల్

హీరో గోపీచంద్ న‌ట‌వార‌సులు హ‌ల్చ‌ల్

సుపుత్ర ర‌త్నాల ఇంట్ర‌డ‌క్ష‌న్ బావుందే

నాన్న‌కు ప్రేమ‌తో! అంటూ సుకుమార్ త‌న తండ్రికి కానుక‌గా ఓ సినిమా తీశారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన ఆ సినిమా తండ్రి సెంటిమెంట్ వ‌ర్కవుటై ఘ‌న‌విజయం సాధించింది. నేడు ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా సెల‌బ్రిటీలు త‌మ వార‌సుల‌తో ఉన్న ఫోటోల్ని సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తుంటే అవి వైర‌ల్ గా మారుతున్నాయి.

తాజాగా టాలీవుడ్ ఎగ్రెస్సివ్ హీరో గోపీచంద్ త‌న వార‌సుల్ని అభిమానుల‌కు ప‌రిచ‌యం చేశారు. ఆ ఇద్ద‌రినీ క‌న్నందుకు సంపూర్ణ‌త సాధించాన‌ని గోపీచంద్ ఆనందం వ్య‌క్తం చేశారు. తండ్రిగా ఇది బెస్ట్ ఫీలింగ్.. వీళ్లే నా బ‌లం.. కంప్లీట్ బ్లెస్డ్“ అంటూ ఉద్వేగానికి లోన‌య్యారు గోపీచంద్.

2001లో తొలి వ‌ల‌పు సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయిన గోపీచంద్ కెరీర్ ఒడిదుడుకుల గురించి తెలిసిందే. ఫ్లాపుల్లో ఉన్న‌ప్పుడు విల‌నీతో మెప్పించి తిరిగి ట్రాక్ లోకి వ‌చ్చే ప్ర‌య‌త్నం చేశాడు. గ‌త రెండు మూడేళ్లుగా కెరీర్ ఏమంత ఆశించినంత‌గా వెల‌గ‌లేదు. అయినా ఆఫ‌ర్ల‌కేం కొద‌వేమీ లేదు. ఆక్సిజ‌న్- ఆర‌డుగుల బుల్లెట్- పంతం- చాణ‌క్య .. ఇవ‌న్నీ ఫ్లాపైనా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా త‌న ప్ర‌య‌త్నం విడువ లేదు. గోపీచంద్ ప్ర‌స్తుతం సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో సీటీమార్ అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రం త‌న కెరీర్ ని తిరిగి ట్రాక్ లోకి తెస్తుంద‌న్న పంతంతో ఉన్నాడు మ‌రి.

 

Related Posts

‘పెళ్లి సందడి’ భామకి అప్పుడే అంత క్రేజ్.?

'పెళ్లిసందడి' సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం. దర్శక రత్న రాఘవేంద్రరావు రూపొందించిన ఈ అద్భుత ప్రేమ కావ్యంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ...

వివాదాల ‘రిపబ్లిక్’ పరిస్థితి ఏమవుతుందబ్బా.!

రిలీజ్‌కి ముందు వివాదాలు.. అనుకోకుండా ఆయా సినిమాలపై అంచనాలు పెంచేస్తుంటాయి. గతంలో చాలా సార్లు ఈ పరిణామాలు చూస్తూనే వచ్చాం. అయితే, ఈ సారి వివాదం కొత్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇంతకీ...

వర్మగారి రక్త చరిత్ర ఇప్పుడు ఏ ‘సిరా’తో రాస్తాడో

రాయలసీమ రక్త చరిత్ర అయిపోయింది. బెజవాడ రక్త చరిత్ర అయిపోయింది. ఇక ఇప్పుడు తెలంగాణా రక్త చరిత్రపై మన ఘన సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దృష్టి మళ్లింది. 90ల కాలంలో...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News