Pawan Kalyan: టాలీవుడ్ హీరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలతో ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు రాజకీయాలలో ఫుల్ బిజీబిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు.. అందులో భాగంగానే ఇటీవల హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేశారు. ప్రస్తుతం భగవదీయుడు భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఇలా ప్రస్తుతం ఒక వైపు సినిమాలో మరొకవైపు రాజకీయాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు పవన్ కళ్యాణ్. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ ఫోటోని చూసిన అభిమానులు ఎంత అద్భుతమైన ఫోటో అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తూ ఆ ఫోటోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ ఫోటోలో ఏముంది అన్న విషయానికి వస్తే..
పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కొడుకులు పెద్దకుమారుడు అకీరా నందన్, చిన్న కుమారుడు మార్క్ శంకర్ తో శుక్రవారం ఉదయం మంగళగిరిలోని తన నివాసానికి వచ్చారు. అధికారులతో, పార్టీ ప్రతినిధులతో ముఖ్యమైన విషయాలపై చర్చించారు. అనంతరం వారితో కలిసి మార్కాపురం నియోజకవర్గ పర్యటనకు బయలుదేరారు..అక్కడ పవన్ జలజీవన్ మిషన్ కింద రూ.1,290 కోట్లతో చేపట్టనున్న తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసారు. అనంతరం సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని, తిరిగి మధ్యాహ్నం 1:45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే తన ఇద్దరు కొడుకులతో కలిసి పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే.. పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ కు అదిరిపోయే స్పందన వచ్చింది.