Hero Suman: నరసరాజు గారి ఇల్లు తమఇల్లు చాలా దగ్గరని కార్లో వెళితే ఒక పది నిమిషాల సమయం పడుతుందని అప్పటికీ ఉన్న కొద్ది పరిచయంతో ఆయన కూతురు కవితతో పరిచయం ఏర్పడిందని నటుడు సుమన్ చెప్పారు. ఆ తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా కావడంతో, అలా సడన్ గా ప్రపోజల్ కూడా రావడంతో తాను ఆమెను పెళ్లి చేసుకున్నట్టు సుమన్ వివరించారు.
ఇకపోతే తనకు వారసులు కావాలని అని అనిపించలేదా అన్న ప్రశ్నకు నటుడు సుమన్ ఈ విధంగా జవాబు ఇచ్చారు. తన దృష్టిలో తలరాత మనిషిని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకు వెళుతుందని, ఏదో తనకు వారసుడు ఉండాలని, అలా కంటిన్యూ కావాలని ఏం కాదని సుమన్ చెప్పారు. తన కూతురు ఎమ్మెస్సీ జెనిటిక్స్ లో గోల్డ్ మెడల్ అని ఎడ్యుకేషన్ సైడ్ ఆమెకు చాలా ఇంట్రస్ట్ ఉందని ఆయన తెలిపారు. మణిపాల్ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ కూడా వచ్చిందని ఆయన గర్వంగా చెప్పారు. అంతకంటే ఇంకేం కావాలి ఇంకా తాను డిస్కరేజ్ కావాల్సిన అవసరం ఏముంది అని ఆయన ప్రశ్నించారు. కాబట్టి ఆమె అనుకున్నట్టుగానే చదివించడానికి ఎంకరేజ్ చేస్తున్నట్టు సుమన్ వివరించారు.
అలా అని సినిమా ఇండస్ట్రీ తప్పు అని తాను చెప్పడం లేదని, ఇదే కాదు ఇంకా చాలా ఫీల్డ్స్ కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. కానీ తన కూతురికి ఇంట్రెస్ట్ లేకుండా బలవంతంగా చేయడం తప్పు కదా, అదీ కాక తనకు ఇంట్రెస్ట్ ఉన్న దానిలో టాలెంట్ ఉంటే దాన్ని ఆపడం ఎందుకని ఆయన అన్నారు. అందుకే తాను ఆమెకి ఎంకరేజ్ చేస్తున్నట్టు సుమన్ స్పష్టం చేశారు.
అంతే కాకుండా తన కూతురు భరత నాట్యంలోనూ ఎంతో ప్రావీణ్యం కలిగిందని సుమన్ చెప్పారు. ఆమెకు క్లాసికల్ టచ్ కూడా ఉంది. కానీ దాన్ని కూడా స్టడీస్ కోసం పక్కన పెట్టి టోటల్ గా స్టడీస్ మీద కాన్సెంట్రేషన్ చేస్తోందని సుమన్ వివరించారు.