సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆకస్మిక మరణం దర్యాప్తులో ట్విస్టులెన్నో బయటపడుతున్న సంగతి తెలిసిందే. యువహీరో సుశాంత్ మరనించి రెండు నెలలు అవుతున్నా ఈ కేసులో పురోగతి కనిపించలేదు. అతని కుటుంబం .. స్నేహితులు న్యాయం కోసం పోరాడుతున్నారు. ప్రతి రోజు ఒక కొత్త సాక్ష్యంతో, అతని అసహజ మరణానికి సంబంధించిన కొత్త సిద్ధాంతం సరికొత్త కోణం బహిర్గతమవుతున్నాయి. ఈ కేసును ప్రస్తుతం ముంబై పోలీసులు, సిబిఐ దర్యాప్తు చేస్తున్న సంగతి విధితమే. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మనీలాండరింగ్ విచారణను కూడా ప్రారంభించింది. సుశాంత్ కేసులో రియా చక్రవర్తి, ఆమె కుటుంబం ఇతరులపై పాట్నాలో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ దర్యాప్తు సాగుతోంది.
తాజా సమాచారం ప్రకారం, # సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రేయసి నటి అంకితా లోఖండే ఉండే ఫ్లాట్ ఈఎంఐని సుశాంత్ కడుతున్నారన్న రహస్యం బహిర్గతమైంది. అతడి బ్యాంక్ ఖాతా నుండి ఈఎంఐ చెల్లింపులు సాగుతున్నాయని తెలిసింది. జూలై 31 న మనీలాండరింగ్ దర్యాప్తును చేపట్టిన ప్రోబ్ ఏజెన్సీ, తన మాజీ ప్రియురాలు అంకితా లోఖండే ప్రస్తుతం ఉంటున్న ఫ్లాట్‌ను కూడా తనిఖీ చేస్తోందని దర్యాప్తుకు సంబంధించిన ఈడి సోర్స్ తెలిపింది.
రూ .4.5 కోట్ల ఫ్లాట్‌కు ఎవరు ఈఎంఐలు చెల్లించారో, ఎంత మొత్తాన్ని సుశాంత్ చెల్లించారు? అన్నది తెలుసుకోవడానికి ఈడి ప్రయత్నిస్తోంది. జూన్ 14 న సుశాంత్ మరణించినప్పటి నుండి లోఖండే తన స్వరం వినిపించారు. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సుశాంత్ కుటుంబం వాదనలకు ఆమె నిరంతరం మద్దతు ఇస్తోంది.
దివంగత నటుడి తండ్రి కె.కె దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తును ఈడి చేపట్టింది. బీహార్ పోలీసులతో. జూలై 25న తన కుమారుడి కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతా నుండి రూ .15 కోట్లు డబ్బు విత్ డ్రా అయ్యిందని లేదా బదిలీ చేశారని సుశాంత్ తండ్రి ఆరోపించారు. దీని తరువాత జూలై 31 న రియా ఆమె కుటుంబ సభ్యులపై పిఎమ్‌ఎల్‌ఎ కింద ఈడి కేసు నమోదు చేసింది.
మరోవైపు, అంకిత తన ఫ్లాట్ యొక్క ఈఎంఐలను చెల్లిస్తున్నట్లు స్పష్టం చేస్తూ తన సోషల్ మీడియా ఖాతాలలో ఒక పోస్టును పంచుకుంది. ఆమె బ్యాంక్ స్టేట్మెంట్ల చిత్రాలను కూడా పంచుకుంది. ఆమె దీని విషయంలో ఏదీ దాచలేదు. ఇకపై అన్నిరకాల స్పెక్యులేషన్స్ ని నిలిపివేసాను. నేను చేయగలిగినంత పారదర్శకంగా చేస్తాను. నా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అలాగే నా బ్యాంక్ స్టేట్మెంట్ (01/01/19 నుండి 01/03/20) ని మీకు షేర్ చేస్తున్నాను అని తెలిపారు. నా ఖాతా పరిశీలిస్తే ఇంకే సందేహం ఉండదని అంకిత లోఖండే తెలిపారు.