క్వీన్ కంగనా రనౌత్ హృతిక్ రోషన్ పై మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడింది. సుశాంత్ సింగ్ ని ప్రేమించిన సారా అలీఖాన్ అతడితో గడిపింది. కానీ ఒత్తిడికి తలొంచి అతడిని వదిలేసింది! అంటూ ఓ నెటిజన్ అన్న మాటకు కంగన కొనసాగింపుగా నెపోటిజాన్ని జోడించి సారాను తిట్టే పని పెట్టుకుంది. అంతేనా ఈ గొడవలోకి హృతిక్ రోషన్ ని బలవంతంగా లాగి ద్వేషాన్ని వెల్లగక్కింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేదార్‌నాథ్ చిత్రంలో సారా అలీఖాన్ కి సహనటుడు. సారా అలీ ఖాన్‌తో సంబంధం ఉన్నట్లు రిపోర్లులు ఉన్నాయి. ఎస్ఎస్ఆర్ – సారా వ్యవహారం పై వార్తలు మీడియాలో ఉన్నాయి. ఆ జంట స్పష్టంగా ప్రేమలో పడింది. తమ బహిరంగ ప్రదేశంలో కూడా ఒక గదిని షేర్ చేసుకున్నారు. ఈ ఫాన్సీ నేపోటిజం పిల్లలు హాని కలిగించేందుకు వెనకాడరు. దీనివల్ల బయటివారికి కలలు నిజమవుతాయా? వారిని బహిరంగంగా డంప్ చేస్తారు? “ అంటూ తిట్టేసింది.
ఫాన్సీ నేపోటిజం కిడ్ అంటూ సారాను విమర్శించింది క్వీన్. దీనికి ఓ నెటిజన్ సారా-సుశాంత్ పిచ్చి ప్రేమలో ఉన్నారన్న విషయాన్నినేను చెబితే ఎవరూ వినలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఇదే గొడవలో హృతిక్ గురించి కంగనా చేసిన ట్వీట్ వేడెక్కించింది.
“నేను హృతిక్‌తో పంచుకున్నది ఆ సమయంలో నిజమైనది. అకస్మాత్తుగా అతను ఎందుకు ఇంత శత్రుత్వం నెత్తికెత్తుకున్నాడు అనేది ఇప్పటికీ నాకు ఓ రహస్యమే“ అని అంది క్వీన్. అలాగే ఈ రెండు కేసుల్లో అటు సారా ప్రేమ కానీ ఇటు హృతిక్ ప్రేమలో కానీ నిజాయితీ లేదని కంగన వాదించింది.